
ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవడం గురించి భారత మాజీ ఆటగాడు మహమ్మద్ ఖైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అత్యుత్తమ టీం వరల్డ్ కప్ గెలిచింది అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను అంటూ కామెంట్ చేశాడు ఎందుకంటే పేపర్ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా కనిపిస్తుంది అంటూ మహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. అయితే గ్లేన్ మిచెల్ అనే యూసర్ మహమ్మద్ కైఫ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయగా.. దీనిపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు.
మహమ్మద్ కైఫ్ అంటే నాకు ఇష్టం అంటూనే చురకలు అంటించాడు డేవిడ్ వార్నర్. నాకు కైఫ్ అంటే ఎంతో ఇష్టం. అయితే పేపర్ మీద ఏం కనబడుతుంది అన్న విషయంతో సంబంధం లేదు. అసలైన సమయంలో మన ప్రదర్శన ఎలా ఉందన్నది ముఖ్యం. అందుకే దానిని ఫైనల్ మ్యాచ్ అంటారు. అదే అన్నింటికంటే కీలకం. అదే ఆటకు అసలైన అర్థం. 2027లో చూద్దాం అంటూ డేవిడ్ వార్నర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ పెట్టిన ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.