ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఎన్నో ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన హార్దిక్ పాండ్య.. ఆ తర్వాత టీం నుంచి తప్పుకుని గుజరాత్ జట్టులోకి వెళ్ళాడు. ఇక కెప్టెన్సీ కూడా చేపట్టాడు. మొదటి ప్రయత్నంలోనే గుజరాత్ ను టైటిల్ విజేతగా నిలిపాడు. దీంతో అతని కెప్టెన్సీ నైపుణ్యం చూసి అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇక భారత కెప్టెన్సీ రేస్ లో కూడా అతని పేరు ముందు వరుసలోకి వచ్చేసింది . అయితే ఇక రెండో ప్రయత్నంలో కూడా అటు గుజరాత్ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు హార్థిక్ పాండ్యా. దీంతో సారధ్య బాధ్యతలను భుజానా వేసుకొని టీం ని ముందుకు నడిపించడంలో అతనికి తిరుగులేదు అని మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపించారు.
అలాంటి హార్దిక్ పాండ్య ఇక ఇప్పుడు ఏకంగా గుజరాత్ టైటాన్స్ వీడబోతున్నాడు అన్న వార్త అభిమానులు అందరిని కూడా షాక్ కి గురిచేస్తుంది. అతను గుజరాత్ ను వీడి మళ్లీ తన పాత టీమ్ అయిన ముంబై జట్టులోకి రాబోతున్నాడట. ఇందుకోసం ఆల్ క్యాష్ డీల్ కింద గుజరాత్ టైటన్స్ కి ముంబై ఇండియన్స్ ఏకంగా 15 కోట్ల రూపాయలు చెల్లించబోతుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే అతను గుజరాత్ టీం తరపున కొనసాగితే బాగుంటుందని.. ఎందుకంటే జట్టు కెప్టెన్సీ అతని చేతిలోనే ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి