గతంలో నేపాల్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగిన సందీప్ లమీచానే ఇలాగే కేసులో ఇరుక్కున్నాడు. ఏకంగా ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడు అన్న ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదు అయింది. ఇక పోలీసులు కూడా అరెస్టు చేశారు అని చెప్పాలి. అయితే ఇక ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో అటు లంక క్రికెట్ బోర్డు అతనిపై నిషేధం కూడా విధించింది. అయితే ఇటీవలే సందీప్ లమీచానే బయటికి వచ్చాడు అనే విషయం తెలిసిందే. ఇక అతని రిక్వెస్ట్ తో నేపాల్ క్రికెట్ బోర్డు కూడా నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ క్రమంలోనే ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుండగానే ఇటీవల పలు క్రికెట్ మ్యాచ్లు కూడా ఆడాడు సందీప్.
అయితే 18 ఏళ్ల అమ్మాయిపై రేప్ కేసులో అరెస్ట్ అయిన సందీప్ నిజంగానే నేరం చేశాడు అన్న విషయం ఇటీవలే కోర్టు విచారణలో తేలింది. కాట్మాండ్ జిల్లా కోర్టు ఇక ఈ క్రికెటర్ ని దోషిగా తేల్చింది. తదుపరి విచారణలో సందీప్ కు జైలు శిక్షను ఖరారు చేయబోతుంది అని చెప్పాలి. కాగా గత ఏడాది ఆగస్టులో ఇలా అమ్మాయిని రేప్ చేసిన కేసులొ అతని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. ఇక ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగగా.. ఇటీవల అతను దోషిగా తేలాడు. దీంతో జైలు శిక్ష పడనుంది. ఇక లంక బోర్డు మరోసారి అతనిపై నిషేధం విధించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. కాగా గతంలో ఈ ప్లేయర్ ఐపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి