2024 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంత అద్భుతమైన ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు కేవలం బౌలింగ్ విభాగం మీద మాత్రమే ఆధారపడి.. ఐపీఎల్లో బరిలోకి దిగిన సన్రైజర్స్ జట్టు ఈసారి మాత్రం బ్యాటింగ్ లో కూడా ప్రతిష్టంగా కనిపిస్తోంది. ఎంతలా అంటే ఏకంగా ప్రత్యర్థి జట్లు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చూసి వణికి పోయే విధంగా అదరగొడుతుంది. ఐపీఎల్ హిస్టరీ లోనే అత్యధిక స్కోరుని ఒక్క సీజన్లోనే రెండుసార్లు బ్రేక్ చేసింది సన్రైజర్స్ హైదరాబాద్.


 అయితే ఈ సీజన్లో తప్పకుండా టైటిల్ గెలుస్తుంది అనే నమ్మకాన్ని కూడా అభిమానులు అందరిలో కూడా కలిగించింది. ప్రతి మ్యాచ్ లో కూడా విధ్వంసకరమైన బ్యాటింగ్ తొ ప్రత్యర్థులకు ముచ్చటలు పట్టించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక పాయింట్ల పట్టిక లో రెండవ స్థానంలో నిలవడంతో.. మొదటి క్వాలిఫైయర్ లో కోల్కతా జట్టుతో తలబడబోతుంది అని చెప్పాలి. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు తర్వాత రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడబోతుంది. ఈ క్రమం లోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరిట ఉన్న ఒక రికార్డును ఇక ఈసారి ఏదైనా జట్టు బ్రేక్ చేయబోతుందా అన్నది ఆసక్తికరంగా మారి పోయింది. 2016 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ పేరిట ఒక అరుదైన రికార్డు నమోదయింది. ఎలిమినేటర్, క్వాలిఫైయర్ టు,  ఫైనల్ మ్యాచ్లో గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. 2016 లో ఈ రికార్డు సృష్టించింది. కాగా ఈ సీజన్లో ఎలిమినేటర్ లో ఆర్సిబి రాజస్థాన్ జట్లు తలబడబోతున్నాయ్. దీంతో ఈ రెండు జట్లలో ఏదైనా సన్రైజర్స్ రికార్డును బ్రేక్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక నేడు కోల్కతా,  హైదరాబాద్ జట్ల మధ్య జరగబోయే మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ఫై అందరి దృష్టి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl