టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నెళ్ల నుంచి వరల్డ్ కప్ ఎడిషన్ లో కాస్త వెనుకబడిపోయిన భారత జట్టు.. ఇక ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ ని ముద్దాడాలి అనే కసితో ఉంది. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా లేకుండా సూపర్ 8 వరకు కూడా దూసుకొచ్చింది టీమ్ ఇండియా. సూపర్ 8 లో కూడా ఇలాంటి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. సూపర్ 8లో ఇప్పటివరకు ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ లతో రెండు మ్యాచ్లు ఆడింది. ఈ రెండు మ్యాచ్ లలో కూడా 47, 50 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది.


 అయితే ఇలా టీమ్ ఇండియా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉండగా.. ఇక జట్టు విజయాల్లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కీలక పాత్ర వహిస్తున్నాడు. చివర్లో వచ్చి అతను బ్యాటింగ్తో మెరుపులు మెరూపించడమే కాదు.. ఇక తన ఫాస్ట్ బౌలింగ్ తోను వికెట్లు పడగొట్టే జట్టును విజయతీరాలకు నడిపించగలుగుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ టైటిల్ గెలవడంలో కూడా ఎంతో కీలకంగా వ్యవహరిస్తాడు అంటూ ఎంతో మంది క్రికెట్ నిపుణులు  కూడా అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయం గురించి భారత మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఉంటాడు అంటూ మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్ ఆరోపించాడు. వరల్డ్ కప్ కి ముందు హార్దిక్ పాండ్యా ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఐపీఎల్ లో ఏమాత్రం ఫామ్ లో కూడా లేడు బౌలింగ్ లోకి కూడా పస లేదు. కానీ టి20 వరల్డ్ కప్ టోర్నీకి వచ్చేసరికి అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. మానసికంగా అతను ఎంత బలమైన ఆటగాడు అన్నదానికి ఇదే నిదర్శనం అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్ అరుణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: