
జెంటిల్‌మెన్స్ గేమ్‌గా పేరుగాంచిన క్రికెట్‌లో మరోసారి నిరాశ కలిగించే ఘటన చోటుచేసుకుంది. మే 28న బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా జరిగిన ఎమర్జింగ్ జట్ల నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్ల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో దక్షిణాఫ్రికా బౌలర్ త్సెపో న్టులి మరియు బంగ్లా బ్యాటర్ రిపాన్ మోండోల్ ఒకరినొకరు తోసుకుంటూ, ఫిజికల్ అటాక్‌కు దిగారు. ఈ ఘటన 105వ ఓవర్‌లో చోటుచేసుకుంది. న్టులి వేసిన బంతిని రిపాన్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా కొట్టాడు. దీంతో కోపానికి గురైన న్టులి, బ్యాటర్ వద్దకు వెళ్లి వాగ్వాదం ప్రారంభించాడు. వెంటనే రిపాన్ కూడా స్పందించి అతన్ని వెనక్కి నెట్టాడు. కోపంతో ఊగిపోయిన న్టులి, రిపాన్‌ను తోసి, అతని హెల్మెట్ గ్రిల్‌ను పట్టుకొని శారీరక దాడికి దిగాడు.
గొడవ పెద్దదవుతున్న వేళ, అంపైర్లు ఇంకా ఆక్కడే ఉన్న మిగతా ఆటగాళ్లు మద్యలోకి వచ్చి ఇద్దరినీ విడదీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మైదానంలో జరిగిన ఈ ఘర్షణ, క్రికెట్‌లోని స్పోర్ట్స్‌మన్‌షిప్ ప్రశ్నార్థకంగా మారేలా చేసింది. మ్యాచ్ అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఐసీసీ ప్రోటోకాల్స్ ప్రకారం ఇద్దరు ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఘర్షణ తర్వాత ఆట తిరిగి ప్రారంభమైనప్పటికీ, మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటనతో మరోసారి క్రికెట్‌లో ఆటగాళ్ల ప్రవర్తనపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి ప్రవర్తనలు ఆట గౌరవాన్ని దిగజార్చుతాయని, ఈ సంఘటన క్రికెట్ చరిత్రలో ఒక చెత్త ఘట్టంగా నిలిచిపోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చిన్నగా మొదలైన ఈ గొడవ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానులను తన వైపు తిప్పుకునేలా చేసింది. చూడాలి మరి ఈ ఘటనలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఆటగాలను ఐసీసీ ఏ విధంగా శిక్షకు గురి చేస్తుందో.