
ఇంతకు ముందు రికార్డు గుజరాత్ టైటాన్స్ పేరిట ఉండేది. వారు 2023లో 3,054 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత SRH జట్టు 2024లో 3,052 పరుగులతో మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ రికార్డులను పంజాబ్ కింగ్స్ అధిగమించింది. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు 8 మ్యాచ్‌ల్లో 200కుపైగా పరుగులు చేసి ప్రత్యర్థులపై భీకర దాడి చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించడంతో భారీ స్కోర్లు సాధించగలిగారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన వారు, మ్యాచ్ లలో పరుగుల వర్షం కురిపించారు.
ఈ రికార్డుతో పాటు పంజాబ్ కింగ్స్ ఆటతీరుపై అభిమానుల్లో విశేషమైన ఉత్సాహం నెలకొంది. పంజాబ్ బ్యాటింగ్ శక్తి ఈ సీజన్‌లో ఐపీఎల్ చరిత్రను తిరిగి రాసినట్టు చెప్పవచ్చు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం మొదటి నుండే ఎటాక్ గా సాగింది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు ఫైనల్ వరకు వచ్చి ఆర్సీబి చేతిలో 6 పరుగుల తేడాతో ఓడి మరోసారి కప్ ను చేజార్చుకుంది. ఇక మరోవైపు 18 ఏళ్ల తర్వాత ఆర్సీబి తన ఐపీఎల్ మొదటి కప్ ను అందుకుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఏర్పాటు చేసిన కార్యక్రమం నేపథ్యంలో పెద్ద ఎత్తున్న తోపులాట జరిగింది. అందులో 11 మంది మృతి చెందగా, 50 మంది పైన గాయపడ్డారు.