ఈ మధ్యకాలంలో చాలామంది ఫుడ్ బిజినెస్ పై పడుతున్నారు.  ఫుడ్ బిజినెస్ లో పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ అనే ఉద్దేశం గా చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా తమ సంపాదించిన డబ్బును ఫుడ్ బిజినెస్ లోనే పెడుతున్నారు . చాలామంది స్టార్ హీరోస్ కి కూడా రెస్టారెంట్లు ఉన్న విషయం తెలిసిందే . తాజాగా ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారు . టీమిండియా స్టార్ మహమ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇప్పుడు క్రికెట్ పిచ్ పైనే కాకుండా పాకశాల రంగంలో నుండి తన అదృష్టాన్ని  పరీక్షించుకోవడానికి ట్రై చేస్తున్నాడు .


హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఆయన ఓ రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. రోడ్ నెంబర్ 3 లో జోహార్ పేరుతో ఒక లగ్జరీ రెస్టారెంట్ ను ప్రారంభించాడు ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్.  జూన్ 24వ తేదీ అధికారికంగా  ప్రారంభమైన ఈ రెస్టారెంట్ అభిమానులను అదేవిధంగా ఆహారప్రియులను బాగా అట్రాక్ట్ చేస్తుంది . మరీ ముఖ్యంగా పేరుతోనే సగం మంది జనాభాను తన రెస్టారెంట్ కి పిలిచే విధంగా చేసుకున్నాడు సిరజ్. ఈ హోటల్ కి "జోహార్పా". అనే పేరు పెట్టడం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది.



సిరాజ్ తన సొంత నగరమైన హైదరాబాద్ పై తనకున్న ప్రేమను తెలియజేస్తూ ఇక్కడి సంస్కృతిని వారసత్వాన్ని జోహార్పా ద్వారా చాటి చెప్తున్నారు . జోహార్పా మెనూలో హైదరాబాద్ ఐకానిక్ వంటకాలు అయిన బిర్యాని, హలీం , కబాబ్ స్పెషల్ ప్లేస్ ఆక్యూపై చేశాయి . వీటితోపాటు రకరకాల కొత్త డిషెస్ కూడా ఉన్నాయి.  మరీ ముఖ్యంగా స్టఫ్డ్ మటన్ పరాటా అందరికీ ఫేవరెట్ గా మారిపోయింది.  సాంప్రదాయ వంటకాలను ఇంకా ఇష్టపడే విధంగా ఆధునికంగా కలగలిపి స్పెషల్గా వడ్డించేస్తుంది సిరాజ్ హోటల్ టీం . మరీ ముఖ్యంగా మొగల్ . పరిషియన్ . అరేబియన్ , చైనీస్ వంటకాల మేళవింపుతో సిరాజ్ తన హోటల్ ని ఇంకా స్పెషల్ గా మార్చేశారు.  అంతే కాదు దానికి తగ్గట్టే కాస్ట్  కూడా ఎక్కువగానే ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  స్టార్టింగ్ స్టార్టింగ్ బిర్యానీ 400 రూపాయల నుంచి మొదలవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . కామన్ పీపుల్స్ కూడా కొనేలా పెట్టండి రేటు బాసు అంటూ  కౌంటర్స్ కూడా పేలుతున్నాయ్..!

మరింత సమాచారం తెలుసుకోండి: