ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యువతకు గుడ్ న్యూస్ .. రెడ్ మీ నుంచి మరో ఫోన్ లాంఛ్ అయ్యింది.రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 10ఎస్ మోడల్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు రెడ్‌మీ నోట్ 10ఎస్ మోడల్‌ను రిలీజ్ చేసింది. రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో నాలుగో స్మార్ట్‌ఫోన్ ఇది. బడ్జెట్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ ఈ మోడల్‌ను తీసుకొచ్చింది షావోమీ. 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్‌లో రెడ్‌మీ నోట్ 10ఎస్ రిలీజ్ అయింది..


అయితే, ఈ ఫోన్ మే 18 న అమెజాన్, షావోమీ వెబ్‌సైట్లలో సేల్ మొదలవుతుంది. షావోమీ స్టోర్లలో కూడా ఈ ఫోన్ ను కొనవచ్చు..ఇకపోతే ఈ ఫోన్ ఫీచర్లు ను ఒకసారి పరిశీలిస్తే..64జీబీ, 128జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. 6జీబీ ర్యా మ్ ను కలిగి ఉంటుంది.64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ,8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ కెమెరా ,2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ,2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ప్రంట్ కెమెరా విషయానికొస్తే..13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక బ్యాటరీ సామర్థ్యం చూస్తే..మీడియాటెక్ హీలియో జీ95. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 సపోర్ట్ చేస్తుంది. డీప్ సీ బ్లూ, ఫ్రాస్ట్ వైట్, షాడో బ్లాక్ కలర్స్ లలో అందుబాటులో ఉంది.


ఇకపోతే రెడ్ మీ కంపెనీస్మార్ట్‌ఫోన్‌తో పాటు రెడ్‌మీ వాచ్‌ను కూడా రిలీజ్ చేసింది షావోమీ. 1.4 అంగుళాల డిస్‌ప్లే, 2.5డీ టెంపర్డ్ గ్లాస్, బ్లూటూత్ 5.0 సపోర్ట్, 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్‌మీ వాచ్‌లో ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, సిక్స్ యాక్సిస్ సెన్సార్, జియోమ్యాగ్నెటిక్ సెన్సార్, యాంబియెంట్ లైట్ సెన్సార్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. హార్ట్ రేట్ 30 రోజుల రికార్డ్ ఉంటుంది. ఇక ఇందులో ట్రెడ్‌మిల్, ఔట్‌డోర్ రన్నింగ్, ఇండోర్ అండ్ ఔట్‌డోర్ సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి ఏడు రకాల స్పోర్ట్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో 230ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే 7 రోజులు వాడుకోవచ్చు.. ఈ వాచ్ ధర 3,999  రూపాయలు గా ఉంటుంది.. మే 25 న మార్కెట్ లోకి రానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: