ప్రస్తుతం ఎండాకాలం రావడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వేడికి తట్టుకోలేక ఉండే పరిస్థితి ఎదురవుతుంది .ప్రతి ఒక్కరి ఇండ్లలో ఎక్కువగా ఉపయోగించేది ఫ్యాన్.. తిరుగుతున్నప్పటికీ ఇది గాలి తగలడం లేదా అయితే ఇందుకోసం ఒక చిన్న ట్రిక్ చేస్తే సరిపోతుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. వేసవిలో ఫ్యాన్ కి గాలి సరిగ్గా రాకపోవడంతో వీటిని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది.


ఒక్కసారి తగినంత ఓల్టేజ్ ఉన్న ఫ్యాన్లకు సరిగ్గా అందకుండా ఉంటుంది.ఎండాకాలం ప్రారంభం అవుతూనే ఈ సమస్య ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండనే ఉంటుంది. తక్కువ వోల్టేజ్ వచ్చిన తర్వాత కూడా పవర్ యూనిట్ అదే స్థాయిలో ఉపయోగించబడుతుంది.. కానీ గాలి మాత్రం తగలదు అటువంటి పరిస్థితులలో ఫ్యాన్ రిపేర్ చేయడం అవసరము.. ఫ్యాన్ బ్లేడు ముందు భాగం సూటిగా వక్రంగా ఉండాలి.. ఫ్యాన్ రెక్కలు కూడా వంకర టింకర్ గా ఉండకూడదు. ఇలా ఉంటే ఫ్యాన్ సరిగ్గా నడవదు అందువల్ల స్పీడ్ తక్కువగా ఉంటుంది.


ఫ్యాన్ బ్లేడ్ లకు దుమ్ము కణాలు వాటి కోణాల భాగంలో ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఫ్యాన్ స్పీడు తగ్గుతుంది. ఇలా దుమ్ము పడిన వెంటనే మోటర్ పైన ఎక్కువ ఒత్తిడి ఏర్పడి కరెంటు బిల్లు అధికంగా వచ్చేలా చేస్తుంది. దీనివల్ల కూడా ఫ్యాన్ వేగవంతం తగ్గిపోతుంది.. ఇది సీలింగ్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ కూలర్ లేదా మరేదైనా వాటికి సమస్యగా తలెత్తుతుంది.



ఫ్యాన్స్ స్పీడు  తగ్గిన వెంటనే ఫ్యాన్ రెక్కల ముందు భాగాన్ని తడి గుడ్డతో శుభ్రంగా చేయాలి. బ్లేడు పై ఎక్కువ ఒత్తిడి చేయకూడదు.. ఫ్యాన్ రెక్కలు వంగిపోకుండా చూసుకోవాలి. ఫ్యాన్ గాలి వేగంగా బీంచినప్పుడే ఫ్యాన్ మోటార్ పైన తక్కువ లోడు పడుతుంది దీనివల్ల విద్యుత్ బిల్లు కూడా తగ్గుతుంది. అందుచేతనే ఫ్యాన్ దుమ్ము పట్టిన వెంటనే తుడుచుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: