శేఖర్ మాస్టర్ సినిమాలనే కాదు టీవీ లకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈటీవి లో ప్రసారమవుతున్న అల్టిమేట్ షో ఢీ కి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.ఈ షో ప్రస్తుతం 13వ సీజన్‌ని జరుపుకుంటోంది. కింగ్స్ వర్సెస్ క్వీన్స్‌గా సాగుతున్న ఈ సీజన్‌కు శేఖర్ మాస్టర్, సంగీత, పూర్ణ జడ్జిలుగా ఉన్నారు. అబ్బాయిల వైపు మెంటర్లుగా సుధీర్, ఆది ఉండగా.. అమ్మాయిల వైపు రష్మి, దీపిక ఉన్నారు. ప్రదీప్ వ్యాఖ్యతగా ఉన్నారు. ఇక ఈ షోలో తమ డ్యాన్స్‌లతో కంటెస్టెంట్లు అదరగొట్లేస్తున్నారు. షో ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..