అల్లరి నరేష్ ఓ కామెడీ సినిమా చేస్తే.. సినిమాలో కామెడీ బాగుందని అంటారు కానీ.. కామెడీ బాగా చేశారని అనరు.. అదే గమ్యం, శంభో శివ శంభో వంటి చిత్రాలైతే అల్లరి నరేష్ బాగా నటించాడురా అని అంటున్నారు అంటూ చెప్పాడు. గతంలో ఈ షో కు వచ్చిన నరేష్ రోజా తో కాలు కదిపాడు.. ఇప్పుడు కూడా అదే చేశాడు. జడ్జ్‌గా ఉన్న రోజా స్టేజ్ మీదకు ఎక్కిందంటే దడదడలాడిస్తుంటుంది. రోజా డ్యాన్సులు వేస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆమె గ్రేస్, ఆమె స్టైల్ అన్నీ కూడా అందరినీ కట్టిపడేస్తుంటాయి.