బిగ్ బాస్ కంటెస్టెంట్లు, అదిరింది టీంతో కలిసి కామెడీ స్టార్స్‌ను గ్రాండ్‌గానే లాంచ్ చేశారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు పోటీగా వచ్చిన ఈ షో బాగా క్లిక్ అయింది. అయితే ఇందులో అషూ, అరియానా, అవినాష్‌లు చేసే హంగామా మాత్రం మాములుగా లేదు..అవినాష్, అరియనాలు మాత్రం వారి మద్య ఏదో ఉంది అనే విధంగా వింత స్కిట్స్ చేస్తూ వస్తున్నారు. దాంతో జనాలకు అనేక అనుమానాలు కలిగిస్తున్నారు.గత వారం ఎపిసోడ్లో ఫ్లోర్ మీద జారుతూ ఉండగా.. ఆమె కోసం ఎక్స్ ప్రెస్ హరి, అవినాష్ ఇలా అందరూ రెడీగా ఉన్నారు. ఇక అషూ కూడా కావాల్సినంత గ్లామర్‌ను ఒలకబోస్తోంది. ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కాస్త హాట్ వెదర్ ను క్రియేట్ చేస్తుంది.ఎక్స్ ప్రెస్ హరితో రొమాంటిక్ పర్ఫామెన్స్ చేయడమే కాకుండా హగ్ చేసుకుంది.. అంతటితో ఆగకుండా ముద్దు కూడా పెట్టేసింది. ఆమె అలా ముద్దు పెట్టేయడంతో శేఖర్ మాస్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.