ఇమాన్యూయేల్.. తాగుబోతు రమేష్ స్కిట్లో చేశాడు. ఎంతో ఫన్నీగా సాగిన ఇందులో వీళ్లిద్దరూ అదిరిపోయే పంచులతో ఆకట్టుకున్నారు. అదే సమయంలో స్కిట్ కోసం తాగుబోతు రమేష్‌ను ఇమాన్యూయేల్ కొట్టాడు. అయితే, అది అతడిని నిజంగానే తగిలింది. దీంతో రోజాతో పాటు అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు. ఆ తర్వాత అతడు సారీ కూడా చెప్పాడు.