బిగ్ బాస్ షో ముగిసిన వెంటనే ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించిన డ్యాన్స్ ప్లస్ బాగానేక్లిక్ అయింది. మోనాల్ అందాలు, ముమైత్ ఖాన్, యానీ మాస్టర్,బాబా భాస్కర్, యశ్ మాస్టర్, రఘు మాస్టర్ల కామెంట్లు, గొడవలు ఇలా కాంట్రవర్సీలు క్రియేట్ చేయడంతో బాగానే సక్సెస్ అవుతుంది.డ్యాన్స్ ప్లస్ షోలో బాబా భాస్కర్ ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్లో ఉంటోంది. మోనాల్ గ్లామర్‌ను, క్రేజ్‌ను బాగానే వాడుకుంటున్నారు. రఘు మాస్టర్, యశ్ మాస్టర్లతో మోనాల్ వేసే స్టెప్పులు బాగానే వైరల్ అవుతుంటాయి. ఇక యానీ మాస్టర్‌ను బాబా భాస్కర్ తెగ ఏడ్పిస్తున్నాడు..