జూనియర్ వెండి తెర మీదే కాదు బుల్లి తెరపై కూడా తన హవాను కొనసాగించారు..గతంలో వచ్చిన కొన్ని షో లు తారక్ కు మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి. కాగా, మీలో ఎవరు కోటీశ్వరుడు' ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో ప్రసారం అయ్యే ఈ గేమ్ షో ఇండియాలో 'కౌన్ బనేగా కరోడ్‌పతీ' అనే పేరుతో హిందీలో ప్రారంభం అయింది. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ వచ్చింది.మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో ప్రసారం అయింది. ఇప్పుడీ మరో సీజన్‌తో రెడీ అయింది. తాజాగా ఈ షోకు సంబంధించిన కొత్త ప్రోమోను విడుదల చేశారు.