గంగవ్వ.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..యుట్యూబ్ లో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత చిన్నగా శాటిలైట్ టీవీలో కనిపించి , తనదైన యాసలో మాట్లాడుతూ బాగా ఫేమస్ అయ్యింది. ఇటీవల బిగ్ బాస్ లో సందడి చేసింది. కొన్ని ఆరోగ్యం సహకరించలేని పక్షంలో హౌస్ నుంచి బయటకు సంగతి కూడా అందరికీ తెలిసిందే..అయితే అవ్వకు క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు..