బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా పర్ఫామెన్స్ ల పంట పండిస్తూ..... ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న ఒక మెగా రియాలిటీ షో. ఎంటర్టైన్మెంట్ అందించడంలో మాకు మేమే సాటి అంటూ సీజన్ ల మీద సీజన్ లతో పరుగులు తీస్తూ.... ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ మరో కొత్త టాస్క్ ను "బండి తొయ్యరా బాబు" అనే పేరుతో కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించిన అవినాష్ మరియు అరియనా లకు ఇచ్చాడు.

ఇందులో అరియానాకు ఒక స్టేషన్ ఉంటుంది, అలాగే అవినాష్ కు ఒక స్టేషన్ ఉంటుంది. ఇంటి సభ్యులను ఒప్పించి వారి బండిలో ఎక్కించుకుని వారి స్టేషన్ వద్దకు తీసుకెళ్లాలి, టాస్క్ ఎండ్ బజర్ మోగితరువాత ఎవరి స్టేషన్ వద్ద ఎక్కువ ప్రయాణికులు ఉంటారో వారే టాస్క్ విజేత మరియు తదుపరి కెప్టెన్ అవుతారు. టాస్క్ మధ్యలో కొందరు ఇంటి సభ్యులు డబుల్ గేమ్ ఆడగా...మరికొంతమంది తీసుకున్న స్టాండ్ పైనే నిలబడ్డారు. చివరికి టాస్క్ శాంతియుతంగా ముగియగా... అవినాష్ గెలిచి ఈ వారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ హోదాను దక్కించుకున్నాడు....

అరియనా మాత్రం కొంచెం బాధపడినట్లు తెలిసింది. అయితే అవినాష్ మాత్రం ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేయడంలో సఫలీకృతం అయ్యాడని చెప్పొచ్చు. మరి కెప్టెన్ అయిన అవినాష్ గతంలో లాగే అందరితో సరదాగా ఉంటూ కామెడీ చేయనున్నాడా లేక బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా ఇంటి సభ్యుల కు ఆదేశాలు జారీ చేయనున్నారా అన్న విషయం పై ఆసక్తి నెలకొంది. ఎప్పుడూ చలాకీగా ఉంటూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అవినాష్... ఇప్పుడు ఇంటి కెప్టెన్ కావడంతో పూర్తిగా మారి విషయాన్ని సీరియస్ గా తీసుకుని కొత్త యాంగిల్ లో కనిపించనున్నాడా అన్నది చూడాల్సిందే.   

మరింత సమాచారం తెలుసుకోండి: