శేఖర్ మాస్టర్ ...ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు తనదైన స్టైల్లో స్టెప్పులు కంపోజ్ చేసి కాలు కదిపించాడు.. శేఖర్ మాస్టర్ సినిమాలనే కాదు టీవీ లకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈటీవి లో ప్రసారమవుతున్న అల్టిమేట్ షో ఢీ కి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.ఈ షో ప్రస్తుతం 13వ సీజన్‌ని జరుపుకుంటోంది. కింగ్స్ వర్సెస్ క్వీన్స్‌గా సాగుతున్న ఈ సీజన్‌కు శేఖర్ మాస్టర్, సంగీత, పూర్ణ జడ్జిలుగా ఉన్నారు. అబ్బాయిల వైపు మెంటర్లుగా సుధీర్, ఆది ఉండగా.. అమ్మాయిల వైపు రష్మి, దీపిక ఉన్నారు. ప్రదీప్వ్యాఖ్యతగా ఉన్నారు. ఇక ఈ షోలో తమ డ్యాన్స్‌లతో కంటెస్టెంట్‌లు అదరగొట్లేస్తున్నారు. 



కాగా, ఈ షోకు సంబంధించి వచ్చే వారం ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో లేడి కంటెస్టెంట్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిలోని మధురమే ఈ క్షణమే పాటకు స్టెప్పులు వేశారు.ఆ పాటకు దీపికా, రష్మి తో స్టెప్పులేసి కేక పుట్టించాడు. ఇక రష్మి, దీపికా కూడా అంతే హాట్‌గా స్టెప్పులు వేయడం విశేషం. మొత్తానికి ఈ పాటతో స్టేజ్‌ని వేడెక్కించారు ఈ ముగ్గురు. ఇక మాస్టర్ డ్యాన్స్‌కు హైపర్ ఆది కౌంటర్ ఇచ్చారు. పాట ఆపకపోతే మరో పండుగ వచ్చే వరకు ఆయన స్టెప్పులు వేస్తూనే ఉంటాడు అని సెటైర్ వేశాడు. 



శేఖర్ మాస్టర్ రొమాన్స్ హైలెట్ కాగా, మరో పాట మాత్రం షో రేటింగ్ ను అమాంతం పెంచింది హీరోయిన్ సంగీత.ఖడ్గం చిత్రంలోని అహ అల్లరి అల్లరి చూపులతో పాటకు అదిరిపోయే డ్యాన్స్ వేసింది. ఆమె డ్యాన్స్ వేసే సమయంలో పూర్ణ, రష్మి, దీపికా కూడా సహకారం అందించారు. ఇక ఎప్పటిలాగే సుధీర్, ఆదిలపై ప్రదీప్ వేసే పంచ్‌లు ప్రోమోలో ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ప్రోమోను చూస్తుంటే వచ్చే వారం వీక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుందని తెలుస్తుందని... ఈ మ్యాటర్ ఎంటో తెలియాలంటే షో వచ్చే వరకు ఆగాల్సిందే...


మరింత సమాచారం తెలుసుకోండి: