యాంకర్ ఉదయభాను గుర్తింది కదా..అయినా మర్చిపోయే పర్సన్ కాదు ఆమె. వన్స్ మోర్ ప్లీజ్ అంటూ, డాన్స్ బేబీ డాన్స్ అంటూ, ఢీ అంటూ అప్పట్లో యాంకర్ గా ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసింది.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవోడంతో ఇండస్ట్రీ కి దూరంగా ఉంది.. ఇప్పుడు ఆమెకు ఇద్దరు కవలలు.. 2016లో వారు జన్మించారు. లేడీ కవలలను ఇదివరకే పరిచయం చేసుకున్న ఉదయభాను ఇప్పుడు మళ్ళీ తన బుజ్జి బుజ్జి పాపాయిలా ఫోటోలను షేర్ చేసింది.. గతంలో కంటే కొంచెం పెద్ద గా అయినా ఆ పాపాయిలను చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది..

ఉదయభాను కవల పిల్లల పేర్లు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. ఇద్దరు పిల్లలే తన ప్రపంచం అయిపోయింది. ఒకప్పుడు టీవీ షోలో ఫుల్ బిజీగా ఉండే యాంకర్ పిల్లలను చూసుకునేందుకు పెద్దగా ఈవెంట్స్ కూడా చేయడం లేదు. టీవీ షో ల్లో యాంకర్ అంటే ఇలా ఉండాలని ఓ స్టాంప్ వేసిన ఉదయభాను రీ ఎంట్రీ కోసం ఎంతోమంది ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.. అయితే ఆమెకు ఇప్పుడు పిల్లలను చూసుకోవడంతోనే సరిపోతుంది. కవల పిల్లలు పుట్టిన తర్వాత వారిని చూసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలు చెబుతూ ఉంటుంది. అంతేకాదు పాపాయిల ఫోటోలు, తన మూవ్మెంట్స్ అన్ని అభిమానులతో పంచుకుంటుంది.

ఉదయ భాను కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా కొన్ని సినిమాల్లో, సీరియల్ లో నటించారు. రానా హీరోగా పరిచయమైనా లీడర్ సినిమాలో కూడా ఆమె ఐటెం సాంగ్ చేశారు. మరి రీ ఎంటర్ లో ఆమె సినిమాల్లో నటిస్తారా, లేదా సీరియల్స్ లో నటిస్తార లేదా యాంకర్ గానే చేస్తారా అన్నది చూడాలి. ఏదేమైనా అప్పటికి ఇప్పటికే ఆమె అందం చెక్కు చెదరలేదని ఆమె తాజా ఫోటో లు చూస్తే చెప్పొచ్చు..ఒకవేళ ఆమె యాంకర్ గా వస్తే మాత్రం ఇప్పుడున్న అనసూయ, రష్మీ, శ్రిముఖి లను పడగోట్టేయడం ఖాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: