సుమ హోస్ట్‌గా మొదలైన స్టార్ట్ మ్యూజిక్ షోలో లాస్య, హారిక, నోయల్ ఒక టీంగా పాల్గొన్నారు. ఇక సోహెల్, మెహబూబ్, అఖిల్ మరో టీంమేట్స్గా వచ్చారు. అలా మొత్తానికి ఎవరి గ్యాంగ్‌లను వారితో కంబైన్ చేసి ఆటలు ఆడించింది. ఈ ఎపిసోడ్ బాగానే క్లిక్ అయింది.. ఇకపోతే నాలుగవ సీజన్లో నోభికస్య గ్రూపుకు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. నోయల్, అభిజిత్, హారిక, లాస్యల కాంబోను అందరూ ఇష్ట పడుతుంటారు. బిగ్ బాస్ షో ముగిశాక.. ఈ నలుగురు కలిసి ఎక్కడా కూడా కనిపించలేదు.
అందరూ ఒకసారి బయట కలిస్తే చూడాలని జనాలు అనుకున్నారు.. ఆలాంటి సందర్భాలు ఇప్పటి వరకు రాలేదు. సుమ హోస్ట్ గా చేస్తున్న ఈ షో లో అలాంటి అవకాశం కలిగింది. అందరూ ఒక వేదిక మీద తలుక్కు మన్నారు. కొంత మంది మనుషులు మధ్య బంధాలు ఎప్పటికీ చెరిగిపోవు.. వారి మధ్య ఎడబాటు రాదు.. ఏది ఏమైనా కూడా మళ్లీ కలిసి పోయేందుకు దారిని ఏర్పరచుకుంటారు. ఇప్పుడు ఈ షో లో అందరి కలిశారు.ఈ షో వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అతని స్పీచ్ అందరికి తెలిసిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి