బుల్లి తెరపై పై
ఓంకార్ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. యాంకర్ గా ,దర్శకుడుగా చేస్తూ ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. అయితే
ఓంకార్చేసే షో లు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అతన్ని ప్రతి ఒక్కరూ కూడా అన్నాయ్యా అని పిలుస్తుంటారు. కాగా ఇప్పుడు అతన్ని బావా అని ఒకరు పిలిచారు. అసలు ఎందుకు పిలిచారు. అనే సందేహాలు మొదలు అవుతున్నాయి. ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
ఓంకార్ ఇప్పుడు స్టార్ మాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎంటర్టైన్మెంట్ స్లాట్స్ అన్నీ కూడా
ఓంకార్ అధీనంలోనే ఉన్నాయి. ప్రస్తుతం
ఓంకార్ డ్యాన్స్ ప్లస్,
కామెడీ స్టార్స్ షోలను పైకి లేపే పనిలో పడ్డాడు. ఇప్పుడిప్పుడే డ్యాన్స్ ప్లస్ గాడిలో పడుతోంది. గత వారమే టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోయింది. డ్యాన్స్ ప్లస్ షోలో సెలెబ్రిటీలను తీసుకొచ్చి కంటెస్టెంట్లకు తోడుగా పర్ఫామెన్స్‌లు చేయించాడు. హారిక, మెహబూబ్, విష్ణుప్రియ, ఐశ్వర్యా ఇలా సెలెబ్రిటీలను తీసుకొచ్చి చేసిన ప్రయత్నం మూలంగా మంచి రేటింగ్సే వచ్చాయి. దాంతో ఈ వారం మరో ప్లాన్ వేసాడు.
వాలెంటైన్స్ డేగా రాబోతోన్న ఈ ఎపిసోడ్లో అరియానా అవినాష్‌లను తీసుకొచ్చాడు. అయితే ఈ ట్రాక్‌పై జనాల్లో ఉన్న బజ్ గురించి ఓంకార్‌కు తెలిసిందే. అందుకే ఇలా ఆ ఇద్దరి మధ్య
పెళ్లి టాపిక్ తీసుకొచ్చాడు.. అరియానా బావా అని పిలిచింది.దెబ్బకు
అవినాష్ షాక్ అయ్యాడు.దెబ్బకు ఎక్కడో మండిపోయి.. పిలిస్తే నన్నే అలా పిలవాలి అంటూ అరియానాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
ఓంకార్ లాంటి బావ ఉండాలంటూ అరియానా కూడా
కామెడీ చేసింది. మొత్తానికి
ఓంకార్ అన్నయ్యను బావగా చేసేశారు. మొత్తానికి వారిద్దరి మద్య ఏదో ఉంది అనేది మాత్రం తెలుస్తుంది అంటూ అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.. అంతేకాదు ఎవరు పిలవని కొత్త పిలుపు వినపడటం తో ఈ షో కు సంబందించిన వీడియో ఒకటి సోషల్
మీడియా లో చక్కర్లు కొడుతుంది.