స్టార్ మా లో ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ రోజురోజుకు ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సీరియల్ లో నటించే నటులు కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాలలో కూడా అవకాశాలను కొట్టేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఈ సీరియల్లో భార్యపై అమిత ప్రేమ చూపిస్తూనే, మరోవైపు భార్యను పక్కన పెట్టే భర్త క్యారెక్టర్లో నందు నటిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాడు. నందు పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అవుతున్న ఆయన రియల్ లైఫ్ స్టోరీ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం.

నందు అసలు పేరు చదలవాడ హరికృష్ణ. తెనాలి లో జన్మించిన హరికృష్ణ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2016 లో వివాహం చేసుకున్న హరికృష్ణ 2017 సెప్టెంబర్ నెలలో ఒక కొడుకు కు జన్మనిచ్చారు. హ్యాపీడేస్ వంటి సీరియల్ ద్వారా బుల్లితెర కు పరిచయమైన హరికృష్ణ, తన నటనతో మొదటి సీరియల్ తోనే మంచి ప్రేక్షకాదరణ పొందాడు. ఆ తర్వాత స్వాతి చినుకులు సీరియల్ లో నటించి అక్కడ ఎంతో మంది అభిమానులను మెప్పించిన హరికృష్ణ ఈ సీరియల్ తో ఈయనకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

జెమినీ టీవీలో ప్రసారమైన గోరింటాకు సీరియల్, మిస్సమ్మ వంటి సీరియల్స్ లో నటించి మెప్పించారు హరికృష్ణ. కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా హరికృష్ణ తన నటన ప్రేక్షకులకు చూపించి నటన లో  ఉన్న ప్రతిభ ను కనబరిచాడు. అల్లు శిరీష్ నటించిన కొత్త జంట సినిమా లో మనకు హరికృష్ణ నటించిన విషయం తెలిసిందే. దేవత సీరియల్ ఫేమ్ అర్జున్ హీరోగా నటించిన అర్ధనారి సినిమాలో నటించాడు. ఆ తర్వాత కాయ్ రాజా కాయ్ సినిమా లో కూడా నటించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్ర పోషించాడు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి మెప్పించారు హరికృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: