నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎపిసోడ్ లో హౌజ్ మొత్తం గరం గరం అయ్యింది. ఒక వైపు సన్ని హమీదా రోల్ చేస్తూ అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంటే మరోవైపు షన్ను, సిరిల మధ్య అగాధం చోటు చేసుకుంది. సిరిపై నిప్పులు కురిపించాడు షన్ను అసలేం జరిగిందంటే. మొన్న బిగ్ బాస్ ఇచ్చిన ఫన్నీ టాస్క్ ఇతర ఇంటి సభ్యుల రోల్స్ లో నటించడం నిన్నటి ఎపిసోడ్ లోనూ కొనసాగించాలని ఆదేశించారు బిగ్ బాస్. కాగా అందరూ దానికి సిద్ధమయ్యారు. ఎవరికి నచ్చిన రోల్ ని వారు ఎంచుకుని వారి పాత్రలో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. సన్ని హమీదా గెటప్ లో మామూలుగా నవ్వించలేదు. శ్రీ రామ్ ని ఒక ఆట ఆడేసుకున్నాడు, కానీ రామ్ మాత్రం కాస్త కూడా ఫీల్ అవ్వలేదు.

చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాడు పైగా బాగా ఎంజాయ్ చేశాడు. అయితే షన్ను మాత్రం మొన్నటి ఎపిసోడ్ ని దృష్టిలో పెట్టుకుని సన్నీని మళ్ళీ టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. సన్ని కూడా అది జస్ట్ టాస్క్ మామ అంటున్నా వినకపోవడంతో కాస్త గట్టిగానే మాట్లాడాడు. ఇక షన్ను ఏమో నేను ఈ టాస్క్ చేయనని అలిగి కూర్చున్నాడు. సిరి వెళ్లి ఇది జస్ట్ టాస్క్...నెగెటివ్ గా తీసుకుంటావ్ అంటూ కూల్  చేయబోతే షన్ను రివర్స్ లో సిరిపై మండిపడ్డాడు. అసలు నీ వల్లే ఇదంతా...అసలు నువ్వు మనిషివి కాదా, ఇక్కడ నుండి వెళ్ళిపో, నాకు కోపం తెప్పించకు, ఈరోజు నుండి అందరి లాగే నువ్వు కూడా, అందరి హౌజ్మేట్స్ లాగే నువ్వు కూడా దొబ్బకు నన్ను వెళ్ళిపో, ఓవర్ చేస్తున్నావ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలానే అన్నాడు.

షన్ను నుండి ఆ మాటలను ఏ మాత్రం ఊహించని సిరి ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత మళ్లీ షన్ను వచ్చి కాస్త బుజ్జగిస్తే ఐస్ లా కరిగిపోయి అంతలోనే ఆ మాటలన్నీ మరచిపోయి మళ్ళీ మొదటికొచ్చి హగ్ ఇచ్చేసింది. ఇలా హౌస్ లో నిన్న జరిగింది. ఈ ఎపిసోడ్ చూసిన ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు బాగా ఎంజాయ్ చేసుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: