బుల్లితెరపై యాంకర్ విష్ణుప్రియ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఒకప్పుడు యాంకర్ గా ఎన్నో షో లకు చేసింది. ఇక ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా కూడా నటించింది. అయినా ఈ ముద్దుగుమ్మకు అంతగా అదృష్టం కలిసి రాలేదు. దీంతో ఈ మధ్యకాలంలో బుల్లితెరకు కాస్త దూరమైంది ఈ ముద్దుగుమ్మ. కానీ అప్పుడప్పుడు మాత్రం తన జిమ్ వర్కౌట్ లకు సంబంధించి, ఫోటోలను వీడియోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తూ ఉంటుంది. ఇక విష్ణుప్రియ అప్పుడప్పుడు తన అందచందాలతో సైతం ప్రేక్షకులను మంత్రుల ముగ్గులు చేస్తూ ఉంటుంది.
తాజాగా విష్ణు ప్రియ యూట్యూబ్ ఛానల్ లో మానస్ తో కలిసి చేసిన సాంగ్ టాప్ ప్లేస్ లో స్థానాన్ని సంపాదించుకుంది. ఈ పాటతో మరొకసారి విష్ణు ప్రియ వైరల్ గా మారింది. తన డాన్స్ , రిల్ వీడియోలను ఎప్పుడూ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కేవలం డాన్స్ మీదే కాకుండా ఫైట్స్ యాక్షన్, స్టన్స్ వంటి వాటి మీద కూడా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నది. అందుకోసం విష్ణు ప్రియ స్పెషల్ గా కూడా కోచింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక ఎప్పుడూ కూడా జిమ్ములో వర్కౌట్లు చేస్తూ ఉంటుంది విష్ణు ప్రియ. ఇక ఈషా ఫౌండేషన్, సద్గురును ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటుంది విష్ణు ప్రియ. తాజాగా దేవి నవరాత్రుల సందర్భంగా భవాని దీక్షను తీసుకున్నట్లుగా తన ఇంస్టాగ్రామ్ లో  కొన్ని పోస్టులు షేర్ చేయడం జరిగింది. విష్ణు ప్రియ ఎప్పుడు బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. తాజాగా షేర్ చేసిన కొటేషన్లు మాత్రం కొన్ని వైరల్ గా మారుతున్నాయి. విష్ణు ప్రియ ఎమోషనల్ అవుతూ నా చుట్టూ అందరూ అలాంటి వారే ఉన్నారు నేను మాట్లాడకపోయినా తనని అర్థం చేసుకొని భరిస్తూ ఉంటారని ఒక పోస్ట్ షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: