
ఇదిలా ఉండగా జబర్దస్త్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే జబర్దస్త్ లో తాగుబోతు రమేష్ కూడా కనిపించకపోవచ్చు అంటూ వార్తలు వరల్డ్ అవుతున్నాయి. ఒకప్పుడు సినిమా లలో ఒక వెలుగు వెలిగిన ఈయన తర్వాత అవకాశాలు లేక జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాస్త తగ్గి మరో టీం లీడర్ తో టీం ని షేర్ చేసుకోవడం చాలా బాధాకరమని చెప్పాలి అయినా కూడా ఆయన పట్ల మల్లెమాల టీం కనికరం చూపించడం లేదట. తక్కువ రెమ్యునరేషన్ ఇస్తూనే మరొకవైపు ఆయన స్కిట్స్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారని వార్తలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.
త్వరలోనే జబర్దస్త్ నుంచి తాగుబోతు రమేష్ టీం కూడా కనుమరుగవడం ఖాయం అంటూ స్వయంగా ఆయన టీం లోని కంటెస్టెంట్లే మాట్లాడు కోవడం ఇప్పుడు నిజంగా బాధాకరమని చెప్పాలి. మరొకవైపు జబర్దస్త్ నుంచి తాగుబోతు రమేష్ బయటకు వెళ్లిన సరే మళ్లీ సినిమాలతో బిజీ అవ్వడం ఖాయం అంటూ ఆయన అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.