తెలుగు బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాలుగా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఒక ఓటిటీ సీజన్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ సెవెన్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఏ విధంగా ఉంటుంది ? కంటెస్టెంట్లు ఎవరెవరు రాబోతున్నారు? గేమ్ లో ఏదైనా చేంజెస్ చేయబోతున్నారా ? హౌస్ లో ఎలా ఉండబోతున్నారు? హోస్ట్ ఎవరు ? ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానులను తొలుస్తున్నాయి.


ఇకపోతే బిగ్ బాస్ ఒకటవ సీజన్ కి హోస్టుగా ఎన్టీఆర్,  రెండవ సీజన్ కి హోస్టుగా నాని రాగా ..ఇక మూడవ సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేశారు. ఇక లాస్ట్ సీజన్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.ఇప్పుడు తాజాగా సీజన్ సెవెన్ నుంచి సరికొత్త అప్డేట్ బయటకు రావడం జరిగింది. ఇది సరికొత్తగా ప్లాన్ చేస్తూ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.  ముఖ్యంగా బిగ్ బాస్ కి లీక్ ల బెడద వస్తున్న నేపథ్యంలో పక్కా పగడ్బందీ తో షో నీ ప్లాన్ చేయబోతున్నారు నిర్వాహకులు. ఇకపోతే ఈసారి ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ లో కిక్ ఇచ్చే చేంజెస్ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఎవరు ఊహించని విధంగా ఈసారి విడిపోయిన జంటలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బిగ్బాస్.ముఖ్యంగా వివాదాస్పద వ్యక్తులను విడాకులు తీసుకున్న పాపులర్ జంటలను కంటెస్టెంట్లుగా తీసుకురాబోతున్నారట. అంతేకాదు విడాకులు తీసుకున్న జంటను రహస్య రూమ్ లో వుంచబోతున్నట్లుగా కూడా సమాచారం. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈసారి సీజన్ సెవెన్ కి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరించబోతున్నారు అని..
అందుకే ఈసారి మంచి టిఆర్పి రేటింగ్ కొట్టడానికి భారీగా ప్లాన్లు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈసారి సీజన్ సెవెన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: