బిగ్ బాస్ -7 మొదలై ఇప్పటికీ ఎన్నో వారాలు కావస్తోంది. అయితే ఈసారి విన్నర్ ఎవరనే ప్రశ్న అందరిలోనూ సందేహాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా శివాజీ, అమరదీప్, పల్లవి ప్రశాంత్ టాప్-3 లో ఉండడం జరుగుతోంది. ఇక ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి గౌతమ్ ఎలిమెంట్ కావడం వల్ల వచ్చే వారం కూడా శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 15వ వారం మిడ్ వీక్ లో ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం .అయితే ఈసారి ఎపిసోడ్ కి నాని గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.


తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ -7 కీ గెలిచిన వారికి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ తో పాటు బ్రేజా కారు తో పాటు.. జాయాలుకాస్ నుంచి 15 లక్షలు క్యాష్ అందబోతోందని నాగార్జున తెలియజేశారు. దీంతో బిగ్ బాస్-7  విన్నర్ కి దాదాపుగా 80 లక్షల రూపాయలు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంటుంది అంటూ తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ రేటింగ్ పరంగా మంచి పొజిషన్ ని దక్కించుకుంది.


బిగ్ బాస్ గత కొన్ని సీజన్ల నుంచి ఎక్కువగా నాగార్జుననే హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇక మీదట ఓటీటి వర్షన్ బిగ్ బాస్ ఉండకపోవచ్చు అని పలువురు నేటీ జెన్స్ సైతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకోవడంలో బిగ్ బాస్ ఊహించని స్థాయిలో మరింత క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ మా ఛానల్ రేంజ్ను కూడా ఈ షో రేటింగ్ పరంగా బాగానే హైలెట్ చేస్తోంది. ఇతర భాషలలో కూడా బిగ్ బాస్ కి మంచి ఆదరణ లభిస్తూ ఉన్నాయి. మరి రాబోయే సీజన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: