తెలుగు బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్లలో జబర్దస్త్ గెటప్ శ్రీను కూడా ఒకరు.. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొని ఆ కామెడీతోనే వెండితెర పైన పలు రకాల అవకాశాలు అందుకుంటున్నారు.. సుడిగాలి సుదీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురు కలిసి స్కిట్లు చేస్తే జబర్దస్త్ లో ఖచ్చితంగా హిట్ అయ్యేలా ఉంటుంది. ముఖ్యంగా గెటప్ శ్రీను ఎక్కడ చేసినా కూడా విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ఉంటారు. గెటప్ శ్రీను యాక్టింగ్ కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే అనంతగా నటిస్తూ ఉంటారు.


గెటప్ శ్రీను జబర్దస్త్ ని వదిలేసి పలు సినిమాలలోని ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది  ఇప్పటికే జబర్దస్త్ లో కొన్ని వందల స్కిట్లు చేసినప్పటికీ వెండితెర పైన నటిస్తూ ఉన్నారు. రీసెంట్గా హనుమాన్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు గెటప్ శ్రీను. వీటితో పాటు మరో రెండు మూడు సినిమాలలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ విషయాలను కూడా తెలియజేశారు.. గెటప్ శ్రీను మాట్లాడుతూ తాను ప్రస్తుతం ఈ స్టేజిలో ఉన్నానంటే అది జబర్దస్త్ వల్లే అంటూ తెలిపారు.

అయితే కోట్లు కోట్లు మాత్రం అసలు సంపాదించలేదని కేవలం ఇల్లు మాత్రమే కొనుక్కున్నారని దానికి ఇంకా EMI కట్టాల్సి ఉంది. వీటితో పాటు కారు కూడా కొన్నాను దానికి కూడా EMI కట్టాలి.. తనకు ఉన్నంతలోనే హ్యాపీగా ఉండాలనుకుంటాను అంతే తప్ప అంతకుమించి తనకు ఎలాంటి ఆలోచనలు కూడా లేవని తెలిపారు. చాలామంది కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని ఫీల్ అవుతున్నారు.. అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు..  తన సొంత ఊరిలో కొంతమేరకు పొలం ఉన్నదని అది తమ తాతల నుంచి వచ్చిందంటే తెలిపారు గెటప్ శ్రీను.. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాంప్రసాద్, సుధీర్, తాను కచ్చితంగా నెలలో రెండు మూడు సార్లు అయినా కలుస్తూ ఉంటామని తెలిపారు గెటప్ శ్రీను.

మరింత సమాచారం తెలుసుకోండి: