జబర్దస్త్ షో ద్వారా ఎంతో క్రేజీ సంపాదించుకున్న కమెడియన్లలో లేడీ కమెడియన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా లేడీ గెటప్స్ లో మెప్పించిన వారు కూడా ఉన్నారు. జబర్దస్త్ లో నటించిన వారు అమ్మాయిగా కూడా మారారు.. అలాంటి వారిలో ప్రియాంక సింగ్ కూడా ఒకరు. ఈమెను ముద్దుగా పింకీ అని కూడా పిలుస్తూ ఉంటారు.. జబర్దస్త్ ద్వారా ప్రియాంకకు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్బాస్ షో లో కూడా ఎంట్రీ ఇవ్వడంతో తమ క్రేజ్ మరింత పెరిగిపోయింది. బిగ్బాస్ లో చేరిన తర్వాత ఈమె సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా కనిపిస్తూ ఉండేది.


రెగ్యులర్గా తన ఫోటోలను షేర్ చేస్తూ నేటిజెన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది.హీరోయిన్స్ కూడా అసూయపడే అందంతో ఉన్న ప్రియాంక తాజాగా ఒక యూట్యూబ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. తన జీవితంలో ఎన్నో సమస్యలను ఆటుపోట్లను కూడా ఎదుర్కొన్నానని తెలిపింది.. ప్రియాంక మాట్లాడుతూ.. తను ఎన్నో అవమానాలను కష్టాలను ఎదుర్కొని ఈ రోజున ధైర్యంగా అమ్మాయిగా సొసైటీలో తిరుగుతున్నానని తెలిపింది.


చిన్న వయసులో తన అక్క స్కూల్ నుంచి రాగానే తన డ్రస్సులు వేసుకునే దాన్ని అని అలా రాను రాను పూర్తిగా అమ్మాయిలాగా మారిపోయానని పదవ తరగతి తర్వాత హైదరాబాద్కు వచ్చి మేకప్ ఆర్టిస్టుగా పనిచేశానని ఆ తర్వాత జబర్దస్త్ లో లేడీ గెటప్స్ లో కనిపించానని ఆ డబ్బులతోనే సర్జరీ చేయించుకున్నానని.. సర్జరీ సమయంలో చాలా నొప్పితో ఏడ్చాను హాస్పిటల్ లో పట్టించుకునే వారు కూడా లేరు రక్తం కారుతున్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లు నడుచుకుంటూ వెళ్ళానని ఒకానొక సమయంలో ఆరోగ్యం చాలా దెబ్బతినింది అప్పుడు చాలా సర్జరీ చేయించుకోవలసి వచ్చింది అంటూ ఎమోషనల్ గా తెలిపింది. డబ్బులు కూడా లేవని.. మళ్ళి ఒక్కో మెట్టు ఎక్కుతూ మళ్ళీ ఈ స్థాయికి చేరానని తెలిపింది. అంతేకాకుండా తన జీవితంలో మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాలని మొదటిసారి స్కూల్లో అందరూ ఏడిపించేటప్పుడు తన తండ్రి తిట్టడంతో చనిపోవాలనుకున్నాను.. ఆ సమయంలో కిరోసిన్ తో నిప్పంటించుకొని 60 శాతం వరకు తన శరీరం కారిపోయిందని.. రెండోసారి లవ్ ఫెయిల్యూర్ అయ్యాను.. మరొకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత ఆర్థరైటిస్ రావడంతో ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నాను అంటూ తెలిపింది. ప్రస్తుతం వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: