జబర్దస్త్ ద్వారా చాలామంది లేడీ కమెడియన్స్ కూడా ఈ మధ్యకాలంలో భారీ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.. అలాంటి వారిలో గతంలో జబర్దస్త్ నటి సత్య శ్రీ కూడా ఒకరు. ఈమె పలు చిత్రాలలో కూడా అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ సత్య శ్రీ తల్లి కూడా గతంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాలలో నటించింది. ఈమె తల్లి ప్రోత్సాహంతోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందట. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యశ్రి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.


ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన ప్రేమ గురించి ప్రశ్నించగా పలు విషయాలను తెలియజేసింది.. గతంలో ఒక అబ్బాయి తన వెంట పడేవారని తెలియజేస్తూ తనకి కూడా చాలామంది ప్రపోజ్ చేశారని కానీ ఎవరి ప్రేమను కూడా తాను ఒప్పుకోలేదని తెలిపింది.. అయితే తనకు ప్రపోజ్ చేసిన వారెవరు కూడా ధైర్యంగా తన ముందుకు వచ్చి ప్రేమిస్తున్నానని చెప్పలేదు.. కేవలం స్నేహితుల ద్వారానే విషయాన్ని తెలిపే వారని తెలిపింది.. అలాగే తన ఇంట్లో వాళ్ళు లవ్ అంటే యాక్సెప్ట్ చేయారని కూడా వెల్లడించింది.


అయితే చివరికి ఒక అబ్బాయి ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయడంతో తనకి ఆనందంగా అనిపించిన కానీ నో చెప్పానని.. మళ్లీ అతడు తిరిగి తన వైపు కూడా చూడలేదని తెలిపింది. అయితే ఆ అబ్బాయి తో మాట్లాడుతున్నంత సేపు తన తండ్రిని చూసుకున్నానని తెలిపింది. అయితే ఆ తర్వాత ఆ అబ్బాయిని తన తండ్రి, బాబాయ్ కలిసి కొట్టారని ఆ మరుసటి రోజు అతను హాస్పటల్ బ్యాండేజ్ లతో కనిపించగా తన తండ్రి దగ్గరకు వెళ్లి అడిగితే కొట్టామని చెప్పారని.. ఆ విషయం తనకు చాలా బాధేసిందని తెలిపింది సత్య శ్రీ.. ఇక అప్పటినుంచి లవ్ అంటే తన చుట్టూ కూడా ఎవరిని తిరగకుండా చూసుకునేదాన్ని తెలిపింది. మొత్తానికి సత్య శ్రీ లవ్ స్టోరీ విని నెటీజెన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: