జానకి కలగనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది కన్నడ ముద్దుగుమ్మ ప్రియాంక జైన్. ఇలా సీరియల్ తో వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 7 లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఫినాలే వరకు తన ఆటతీరుతో ఆకట్టుకుంది. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్తగా ఏ సీరియల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ టీవీలలో, ఓటీటి షోలలో మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఇటీవలే డాన్స్ ఐకాన్ 2 షోలో కూడా ప్రియాంక కనిపించింది.


కానీ ఈ షోలో వేసుకున్న డ్రస్సులతో చాలా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. ఇంతవరకు అలాంటి దుస్తులలో ప్రియాంకను ఆడియన్స్ చూడలేదు. కానీ ఎందుకలా మారిపోయిందనే విధంగా ఆమె పైన చాలా నెగెటివిటీ వినిపించింది. వీటి పైన కూడా తాజాగా కిస్సిక్ టాక్ షోలో యాంకర్ జబర్దస్త్ వర్ష ఇంటర్వ్యూలో ప్రియాంక  మాట్లాడుతూ.. "నాకు కూడా చాలా బాధగా అనిపించింది.. కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత తనకే అసహ్యంగా అనిపించింది.. ఆ కామెంట్స్ చదవకుండా ఉండి ఉంటే బాగుండు అన్నట్లుగా తెలిపింది. ఒక మహిళగా తాను ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో బాగా తెలుసు.. తాను కూడా మనుషులమే మాకు కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తే బాధగా ఉంటుంది అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది".


ఇక వివాహం ఎప్పుడు అని అడగగా.. వివాహం గురించి ఒకటైతే చెబుతాను మా పెళ్లి మామూలుగా ఉండదు.. తగ్గేదేలే అన్నట్టుగా చూపిస్తామని ఒకవేళ అన్ని కుదిరితే ఈ ఏడాదే చేసుకుంటాము అంటూ తెలియజేసింది ప్రియాంక జైన్. ఇక లైవ్లోనే తన బాయ్ ఫ్రెండ్ శివ్ కి ఐ లవ్ యు చెప్పింది ప్రియాంక.. తన బాయ్ ఫ్రెండ్ కి తన లిప్స్ అంటే చాలా ఇష్టమని తెలియజేసింది.. ఇక తన బాయ్ ఫ్రెండ్ శివ్ కి బ్లాక్ డ్రెస్ అండ్ అంటే చాలా ఇష్టం అందులో తాను కనిపించానంటే తనమీద వాలిపోతాడు అంటూ తెలియజేసింది ప్రియాంక.

మరింత సమాచారం తెలుసుకోండి: