
గత కొద్దిరోజులుగా సనా మక్బుల్ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సనా ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందారు..సనా మక్బుల్ ఆరోగ్యంపై.. డాక్టర్ ఆశ్నా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు..సనా మక్బుల్ హాస్పిటల్లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ" మై డియర్ స్ట్రాంగ్ లేడీ ఇలాంటి దారుణమైన పరిస్థితులు నువ్వు చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నావు నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది నీ ధైర్యం కోల్పోకుండా నువ్వు పోరాడు కఠినమైన పరిస్థితి నుంచి కూడా నువ్వు బయటపడగలవు అంటూ తెలిపారు.
అయితే ట్విట్ చూసిన పలువురు సినీ ప్రముఖుల, అభిమానులు సైతం సనా మక్బుల్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా తన కాలేయ వ్యాధి నుంచి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. 2020లో ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ వ్యాధి వల్ల ఇబ్బందులు పడుతోందట సనా మక్బుల్. ఈ వ్యాధి వల్ల తన శరీరంలో ఉండే కణాలు కాలేయం పైన దాడి చేయడంతో ఆమె తీవ్ర అనారోగ్య పాలైనట్లుగా తెలుస్తోంది. దీంతో మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్ కి చేరిన కి తెలుస్తోంది సనా మక్బుల్. కెరియర్ ప్రారంభంలో ఇమే పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది.