
ఆషురెడ్డి గతంలో ఆర్జీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాళ్లు వేళ్ళను నోటితో తాకడం పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఇది ఎన్నో విమర్శలకు దారితీసింది. అయితే ఇప్పుడు తాజాగా కాకమ్మ కథలు ప్రోమోలో ఎక్స్ప్రెస్ హరి కూడా ఆషురెడ్డి కాళ్ళను పట్టుకొని పుష్ప డైలాగు చెప్పడం చూడవచ్చు.. అలాగే ఆషురెడ్డి కాలివేలను కూడా నోటితో తాకడానికి ట్రై చేయగా ఆషురెడ్డి వెంటనే హరిని కొట్టి వద్దని వెనక్కి తీసుకుంది. ప్రోమోలో ఈ వీడియో చూసిన పలువురు నేటిజన్ ఏంటి హరి నువ్వు కూడా ఆర్జీవి లాగా మారిపోతున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆషురెడ్డి , ఎక్స్ప్రెస్ హరి పుష్ప డైలాగుని చెప్పడంతో ప్రోమో మరింత వైరల్ గా మారింది. ఈ ప్రోమో కూడా మరింత ఫన్నీగా కనిపిస్తోంది. యాంకర్ గా తేజస్వి మదివాడ పంచ్ డైలాగులతో మరింత ఫన్ క్రియేట్ చేసింది. మరి ఫుల్ వీడియో కి సంబంధించి జూన్ 21 రాబోతోంది. అయితే గతంలో కూడా ఆషురెడ్డి హరికి ఇష్టమైన ఒక బైకును కూడా కొనిచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఇందుకు సంబంధించి టీవీ షో లోనే ఆమె గిఫ్టుగా ఇచ్చింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ఏదో సంథింగ్ ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి.