
అనసూయ మాట్లాడుతూ ఇండస్ట్రీ లోకి రాకముందు ఒక విఎఫ్ఎక్స్ కంపెనీలో పనిచేసే దానినని.. విఎఫ్ఎక్స్ పని అంటే అక్కడంతా కూడా వెట్టిచాకిరిగా ఉంటుందని తెలిపింది.. 8 ,10 గంటలు షిఫ్టులా ఉండదు.. ఏదైనా ప్రాజెక్టు ఇస్తే దానిని సరైన సమయంలోనే ఫినిష్ చేయాలని తెలిపింది. ఆ సమయంలో తనని సుకుమార్, మెహర్రమేష్, త్రివిక్రమ్ వంటి వారు కూడా తనని చూశారని వెల్లడించింది. అలాగే ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమాకు తమ టీమ్ వర్క్ చేసిందని తెలియజేసింది.
ఆ సమయంలో ఆ కంపెనీకి తాను కౌన్సిలర్ గా, హెచ్ఆర్ గా ఉన్నానని తెలిపింది అనసూయ. అటు హాలీవుడ్ సినిమాలతో పాటుగా తెలుగు సినిమాలకు కూడా విఎఫ్ఎక్స్ వర్క్ చేశామని అలా కంపెనీలో పని చేసే సమయంలో తాను డేటింగ్ లో ఉండేదాన్ని అంటూ తెలిపింది.నా లైఫ్ లో ఒక్కరే బాయ్ ఫ్రెండ్ ఉన్నారు..అతడే సుశాంక్ భరద్వాజ్.. అతడినే వివాహం చేసుకున్నానని తెలియజేసింది.అనసూయకు తన తల్లి పవిత్ర పేరు పెట్టాలని అనుకున్నప్పటికీ కానీ తన నాన్న మాత్రం వాళ్ళ అమ్మమ్మ గారి పేరు అయినా అనసూయ పెట్టారని తెలియజేసింది. అనసూయ హరిహర వీరమల్లు చిత్రంలో కూడా నటించింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఫ్లాష్ బ్యాక్, వోల్ఫ్ అనే చిత్రాలు ఉన్నాయి.