ఇటీవ‌ల ఎక్కడ చూసినా మొబైల్‌ ఫోన్లే. అవసరాలకు మొబైల్‌ చాలా అవసరం. సమాచారమైనా, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, ఏ పనైనా కావచ్చు. ఫోను లేకుండా రోజు గడవడం కష్టమే. కాలాగుణంగా మారిన మార్పులతోపాటు, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్‌ ఫోన్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఇక స్మార్ట్‌పోన్ వాడుతున్న వారంద‌రికి వాట్సాప్ ప‌రిచ‌డం అవ‌స‌రం లేని పేరు. సమాచారం సులువుగా ఇచ్చిపుచ్చుకునేందుకు ఓ మార్గంగా మొదలైన ఈ టెక్‌ వేదిక… ఇప్పుడు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

అలాగే ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన వాట్సాప్‌ను రకరకాల కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ప్రతిరోజు కోట్ల‌లో యూజర్లు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇకపై ఫ్లైట్ టిక్కెట్ల కోసం ఆన్‌లైన్ ట్రావెల్ యాప్స్‌ను వెతకాల్సిన అవసరం లేదు. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారానే విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అవును! మీరు విన్న‌ది నిజ‌మే. 

 

దేశీయ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ఈజీ మై ట్రిప్.. వాట్సాప్‌తో అనుసంధానం అయ్యి.. ఈ సదుపాయాన్ని నూతనంగా ప్రారంభించింది. కస్టమర్ సెట్రిక్ విధానంలో భాగంగా తమ సంస్థ నెంబర్‌కు వెళ్లాల్సిన ప్లేస్‌ను కస్టమర్ మెసేజ్ చేస్తే చాలని.. తామే టికెట్ బుక్ చేస్తామని చెప్పింది. ఈ మేర‌కు  ఈ నెల 22వ తేదీన సదరు సంస్థ వెల్ల‌డించింది. అలాగే ఒక్క మెసేజ్ ద్వారా వాట్సాప్ నుంచే అతి తక్కువ ధరకు టిక్కెట్లను పొందవచ్చునని తెలిపింది. మ‌రో విష‌యం ఏంటంటే  టిక్కెట్ల రేట్ల లిస్ట్.. ఆఫర్ల వివరాలు కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు పంపిస్తార‌ట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: