ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే.. ప్ర‌పంచ‌దేశాలు వ్యాప్తి చెందింది. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. అయితే ప్ర‌స్తుతం కరోనా నుంచి కోలుకుంటున్న చైనా న్యూ రికార్డు క్రియేట్ చేసింది. నేపాల్‌‌, చైనా బార్డర్‌‌లోని ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌‌ ఎత్తును కొలిచేందుకు మే 1న బయల్దేరిన చైనా టీమ్‌‌ బుధవారం శిఖరంపైకి చేరుకుంది. వాస్త‌వానికి ఎవరెస్ట్ అటు నేపాల్.. ఇటు చైనా సరిహద్దుల్లో ఉంది. రెండు వైపుల నుంచి శిఖరాన్ని ఎక్కవచ్చు. అయితే క‌రోనా నేపథ్యంలో ఈ సీజన్లో చైనా కేవలం తమ దేశస్థులకు మాత్రమే ఎవరెస్ట్ ప్రయాణానికి అనుమతించింది. 

 

అటు నేపాల్ అన్ని రకాల పర్వతారోహణ కార్యక్రమాలను రద్దు చేసింది. అంటే ఈ ఏడాది ఎవరెస్ట్‌ను అధిరోహించే వారిలో విదేశీయులు లేనట్టే. చైనీయులు మాత్రమే ఎవరెస్ట్ శిఖర ప్రయాణం చెయ్యడం చాలా అరుదైన సందర్భం అని చెప్పుకోవ‌చ్చు. ఇక కొత్త లెక్కల ప్రకారం ఎవరెస్ట్‌‌ ఎత్తు 8844.43 మీటర్లు అని తేల్చింది. ఇంతకుముందు నేపాల్‌‌ ఇచ్చిన కొలతల కన్నా ఇది నాలుగు మీటర్లు తక్కువ. రెండు దేశాల బార్డర్‌‌లో 2015లో వచ్చిన భూకంపం వల్ల శిఖరం ఎత్తు నాలుగు మీటర్లు తగ్గి ఉంటుందని భావిస్తున్నారు. 

 

మే 1వ తేదీన ఈ విషయం గురించి నేపాల్‌తో చైనాకు విబేధాలు వచ్చిన కారణంగా.. మళ్లీ ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు చైనా కొత్త బృందాన్ని పంపించింది. ఇక మ‌రోవైపు తమ దేశానికే  చెందిన టెక్‌‌ సంస్థ హువావేతో కలిసి ఎవరెస్ట్ శిఖరంపై రెండు 5జీ స్టేషన్లను నిర్మించడానికి చైనా ప్లాన్‌‌ చేస్తోంది. ఈ స్టేషన్లు శిఖరాన్ని మొత్తం కవర్ చేస్తాయని అంటున్నా టెక్నికల్‌‌గా ఇంకా టెస్ట్‌‌ చేయాల్సి ఉంది.  వీటి నిర్మాణం పూర్తయితే ఇవే ప్రపంచంలో ఎత్తైన 5జీ స్టేషన్లు కానున్నాయ‌ని తెలుస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: