ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న షియోమీ టీవీల్లో అత్యంత ఖరీదైన టీవీ ఇదే. ఇందులో హెచ్‌డీఆర్, డాల్బీ విజన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.55 అంగుళాల వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. దీని ధరను రూ.54,990గా నిర్ణయించారు. వన్ ప్లస్, టీసీఎల్ వంటి బ్రాండ్ల క్యూఎల్ఈడీ టీవీలకు ఈ టీవీ పోటీ ఇవ్వనుంది. వీటి ధరలు రూ.60 వేల రేంజ్‌లో ఉండగా షియోమీ టీవీ ధర మాత్రం తక్కువగా ఉండటం ఈ టీవీ కు ప్లస్ పాయింట్ అని చెప్పాలి.. ఇకపోతే ఈ నెల 21 న ఈ టీవీ లాంఛ్ కానుంది.
ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. ఈ లేటెస్ట్ వెర్షన్‌తో వచ్చిన అతికొద్ది టీవీల్లో ఇది కూడా ఒకటి. ఇందులో మీడియాటెక్ ఎంటీ9611 ప్రాసెసర్‌ను అందించారు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. 30W సౌండ్ అవుట్‌పుట్‌ను కూడా ఇది అందిస్తుంది... ఇందులో మరో ఆకట్టుకొనే అంశం ఈ టీవీ రిమోట్ లో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు సంబందించిన బటన్స్ కూడా అందించారు. ఇకపోతే గూగుల్ వాయిస్ కమాండ్ కూడా ఉంది. టాప్ కంపెనీలతో పోటీ పడుతున్న ఈ టీవీ ఇప్పుడు మార్కెట్ లో ఏ స్థానాన్ని అందుకుంటుందో చూడాలి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి