ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ కొత్త ఫీచర్లతో అదిరిపోయే హంగులు ఉన్న ఫోన్లను ఎప్పుడు మార్కెట్ లోకి విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే.. గెలాక్సీ సిరీస్ నుంచి బయటకు వచ్చిన ఫోన్లు యూత్ ఆలోచనలకు తగ్గట్లు ఉన్నాయి. దీంతో సేల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అంతే జోష్ తో ఇప్పుడు మరో ఫోన్ ను లాంఛ్ చేస్తున్నట్లు తెలుస్తోంది . శాంసంగ్ గెలాక్సీ ఎఫ్52.. సరికొత్త ఫీచర్లతో రానున్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్ లు లీక్ అయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం..


ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4350 ఎంఏహెచ్‌గా ఉంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ కూడా అందించారు. ఈ ఫోన్ SM-E5260 మోడల్ నంబర్‌ తో టెనా వెబ్ సైట్లో కనిపించింది. ఈ లిస్టింగ్‌ను మొదట మైస్మార్ట్‌ప్రైస్ గుర్తించింది. పంచ్ హోల్ కుడివైపు పైభాగం లో అందించారు. ఫోన్ వెనక వైపు 64 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. దీర్ఘచతురస్రాకారం లో ఈ కెమెరాలను అందించారు.. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ను అందించే అవకాశం ఉంది. ఇందులో 6.5 ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. 


కాగా, ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 2.4 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇందులో అందుబాటు లో ఉంది.బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారమేదీ అందుబాటులో లేదు. అయితే ఈ ఫోన్ ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది... గతంలో వచ్చిన గెలాక్సీ ఫోన్ల తో పోలిస్తే .. ఇప్పుడు వస్తున్న ఫోన్ అడ్వాన్స్ టెక్నాలజీ తో రూపొందుతున్న ట్లు కంపెనీ పేర్కొంది.. ధర మరియు మొదలగు అంశాలు తెలియాల్సి ఉన్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: