ప్రస్తుతం మనం గడుపుతున్న దైనందిక జీవితంలో స్మార్ట్ ఫోన్  అనేది ఒక భాగం అయిపోయింది. ప్రపంచం నలుమూలల ఎక్కడ ,ఏ సమయంలో, ఏమి జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అనుగుణంగా ,ఈ స్మార్ట్ ఫోన్ అందరికీ ఉపయోగ పడుతోంది. అయితే ఇటీవల రైటర్స్ యొక్క కెనాలిస్ ప్రకారం 2021 వ సంవత్సరం లో క్యూ 1 లో సాంసంగ్ సంస్థ స్మార్ట్ ఫోన్ల ను  ఎగుమతి చేయడంలో , ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారులకు గా అవతరించింది. ఇక అంతే కాకుండా ఈ సంవత్సరం స్మార్ట్ ఫోన్  అమ్మకాలను, ఆపిల్ సంస్థ యొక్క ఐఫోన్ ల అమ్మకాలను కూడా వెనక్కు నెట్టింది సాంసంగ్ సంస్థ.


2021 వ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధికంగా స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసిన సంస్థగా ,మూడవ స్థానంలో షియోమి సంస్థ  నిలిచింది. ఇక స్మార్ట్ ఫోన్ ల  ఎగుమతుల విషయానికి వస్తే ,ఈ క్యూ1లో 62 శాతానికి పైగా పెరిగాయి. గతంలో 49 మిలియన్ స్మార్ట్ ఫోన్లు రవాణా చేయబడ్డాయి. ఇప్పుడు మార్కెట్ వాటా14 శాతానికి పెరిగింది. ఇక నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల ను  ఎగుమతి చేయడంలో ఇప్పుడు 27 శాతం పెరిగి, అది 347 మిలియన్ యూనిట్లకు చేరుకుంది.

ఇక ఈ విభాగంలోనే సాంసంగ్ సంస్థ 76.5 మిలియన్ స్మార్ట్ ఫోన్ల ను  రవాణా చేయగలిగింది. ఇక అందుకే మార్కెట్ వాటా కూడా 22% సాధించింది. ఇక ఇందులో ముఖ్యంగా గ్యాలక్సీ s21 సిరీస్ అధికంగా అమ్ముడు పోవడంతో, గుర్తింపు పొందిన ఈ కంపెనీ తన మొబైల్ వ్యాపారంలో త్రైమాసిక లాభంలో 66 శాతం పెరిగింది..

ఇక ఆపిల్ సంస్థ విషయానికి వస్తే ,గత సంవత్సరం మొదటి స్థానంలో కొనసాగిన ఆపిల్, ఈ సంవత్సరం వచ్చేసరికి మొదటి స్థానం నుండి రెండవ స్థానానికి పడిపోయింది. ఇది మొదటి త్రైమాసికంలో 52.4 మిలియన్ స్మార్ట్ ఫోన్లను  రవాణా చేసి, 15 శాతం మార్కెట్ వాటాను సాధించింది. ఇక ఆపిల్ సంస్థ కు చెందిన ఐ ఫోన్ లలో ఐఫోన్ 11 ప్రో మాక్స్ ఫోన్ యూఎస్ లో అత్యధికంగా అమ్ముడయినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి..

ఇక ఈ ఫోన్లు ఇంతలా అమ్ముడుపోవడానికి గల కారణం  కరోనా మహమ్మారి అని చెప్పవచ్చు. ప్రస్తుత సమయంలో ఇంట్లో కూర్చుని పని చేస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవడంతో, ప్రతి ఒక్కరికి ఈ స్మార్ట్ ఫోన్ అవసరం ఎంతో ఉంది . అందుకే చాలామంది ఈ ఫోన్ లను తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: