ఇప్పుడు మొబైల్స్ ఎంత టెక్నాలజీతో వచ్చాయో, మరీ అంతే ఖరీదు గా వస్తూనే ఉన్నాయి. అయితే అంత ఖరీదు పెట్టి కొన్న మొబైల్స్ ,ఒక వేళ ఏదో విధంగా కింద పడి పగిలిపోతాయామో అనే భయం ఉంటుంది అందరిలో.. ఇప్పుడు ఒక మొబైల్ సంస్ధ సరికొత్త మొబైల్ ని కనిపెట్టింది. ఈ మొబైల్ ను ఏం చేసినా కూడా పగిలిపోదట, అయితే ఆ మొబైల్ యొక్క విశేషాలు తెలుసుకుందాం.


చాలా ఏళ్ల నుంచి బాగా గుర్తింపు పొందిన మొబైల్ సంస్థ "నోకియా".ఈ సంస్థ ఒక అధునాతనమైన స్మార్ట్ ఫోన్ ను  కనుక్కొని ఉంది."NOKIA XR 20"అనే ఒక కొత్త మొబైల్ ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ను కూడా నోకియా సంస్థ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇక నోకియా షేర్ చేసుకున్న ఈ వీడియో లో నోకియా ఎక్స్ఆర్ 20 మోడల్ మొబైల్ పై రకరకాలు ప్రయత్నాలు చేసి, దాని సామర్థ్యాన్ని పరీక్షించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో తీసుకురానున్న ఈ మొబైల్ 1.80 మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డ అలాగే మట్టి లో పడిపోయినా లేదా నీటిలో మునిగినా సరే ఏమాత్రం చెక్కు చెదరదట.


ఇక మన భారత మార్కెట్లోకి నోకియాఫోన్ ను సెప్టెంబర్ నెలలో తీసుకురావాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఇండియా మార్కెట్లో దీని ధర రూ.40,900 గా నిర్ణయించబడింది. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్ తో మన ముందుకు రాబోతోంది  ఇక అంతే కాదు ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్  12 వెర్షన్, 13 వెర్షన్ అలాగే 14 వెర్షన్లను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ఇందులో 48 mp కలిగిన బ్యాక్ కెమెరా తో పాటు 13 mp కలిగిన సెల్ఫీ కెమెరాను కూడా అమర్చారు. ఇక ఇందులో 4630 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. వైర్లెస్ చార్జింగ్ ను కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అయితే ఇన్ని ఫీచర్లతో మొబైల్  రావడం ఇదే మొదటిసారి.



మరింత సమాచారం తెలుసుకోండి: