ఇప్పటికే రూ.10 వేల లోపు బడ్జెట్లో రియల్ మీ నార్జో 50 ఐ, పోకో సీ 3 ఇలాంటి స్మార్ట్ ఫోన్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇక వీటికి గట్టిపోటీ ఇవ్వడానికి రియల్ మీ సీ 31.. ఏప్రిల్ 6 అనగా ఈరోజు మధ్యాహ్నం 12 :00 గంటలకు ఫ్లిప్కార్ట్లో సేల్ ప్రారంభం అయ్యింది. ఇకపోతే ఆఫ్ లైన్ స్టోర్ లో కూడా ఈ మొబైల్ లో కొనుగోలు చేయవచ్చు. కలర్స్ విషయానికి వస్తే .. లైట్ సిల్వర్ , డార్క్ గ్రీన్ కలర్ లో మనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ ద్వారా రూ.8,999 . 3జీబీ ర్యామ్ అలాగే 32 జీ బీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
ఇప్పుడు 4జీబీ ర్యామ్ అలాగే 64 జీబీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ తో రూ.9,999కే మనకు లభిస్తోంది. ఇక ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డు అలాగే హెచ్ డి ఎఫ్ సి ఐ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే ₹1000 డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది. ఇక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేస్తే 5% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.