రియల్ కెమెరాను తలపించేలా ఏకంగా 200 మెగాపిక్సల్ కెమెరాతో భారత మార్కెట్లోకి లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది మోటోరోలా మోటో ఎక్స్ 30 ప్రో.. ఇక దీనితోపాటు లెనోవో యాజమాన్యంలోని బ్రాండ్ 30 ప్రో తో పాటు మోటోరోలో Rarz 2022 ను కూడా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం..

మోటోరోలా ఎక్స్ 30 ప్రో , మోటోరోలా రార్జ్ 2022 రెండు స్మార్ట్ ఫోన్లు కూడా స్నాప్ డ్రాగన్ 8 +Gen 1 చిప్ సెట్ లను కలిగి ఉంటాయి. ఇకపోతే రెండు ఫోన్లు కూడా పి ఓ ఎల్ ఈ డి ఎఫ్ హెచ్ డి + 144 Hz డిస్ప్లే తో రానున్నట్లు సమాచారం. ఇక అలాగే ఇందులో కెమెరా విషయానికి వస్తే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 200 మెగా పిక్సెల్ కెమెరాతో కూడిన ఫోను విడుదల చేయడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. అంతేకాదు ఇలా అరుదైన కెమెరాతో భారత మార్కెట్ లోకి విడుదలై చరిత్ర తిరగ రాసింది ఈ స్మార్ట్ ఫోన్.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే 6.7 అంగుళాలు కలిగి ఉంటుంది. ఇక 12gb వరకు LPDDR ram అలాగే 256 GB వరకూ UFS 3.1 స్టోరేజ్ తో 4,500 mah బ్యాటరీని కూడా ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటుంది ఇకపోతే ఈ 200 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ , 12 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా ని కూడా ఇందులో అమర్చబడ్డాయి. ఇక సెల్ఫీ ప్రియుల కోసం 60 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కూడా కలిగి ఉండడం గమనార్హం. ఇక ధరలు త్వరలోనే ప్రకటించనున్నట్లు వార్తలు అందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: