HMD గ్లోబల్ యాజమాన్యం లో నోకియా మొబైల్ -G సిరీస్ గల ఒక స్మార్ట్ మొబైల్ ను విడుదల చేయడం జరిగింది. ఆ మొబైల్ నోకియా G-11 ఈ స్మార్ట్ ఫోన్ కావడమే కాకుండా అదిరిపోయే ఫ్యూచర్ లను కూడా ఈ స్మార్ట్ ఫోన్లో కలవు. ముఖ్యంగా కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సల్ కెమెరాతో కలదు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. సరికొత్త ఫ్యూచర్ల తో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించడం జరిగింది ఈ మొబైల్. తక్కువ లోనే ఎక్కువ ఫీచర్స్ కలిగిన మొబైల్ ను కొనాలనుకునే వారికి ఇదొక అవకాశం అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ విషయాలను తెలుసుకుందాం.



NOKIA -G11 మొబైల్ యూనిక్ T606 ఆక్టా కోర్ ప్రాసెస్ తో కలదు. ఈ ప్రాసెస్ కి జతగా 4GB RAM+64 జిపి స్టోరేజ్ మెమొరీ కలదు. ఎలాంటి యాప్లనైనా సరే ఈ మొబైల్ చాలా సజావు గా నడిపేలా చేస్తుంది. ఈ మొబైల్ లో స్టోరేజ్ పెంచుకోవడానికి అదనంగా మైక్రో ఎస్డి కార్డ్ ఆప్షన్ కూడా కలదు. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి 6.5 అంగుళాలు హెచ్డి డిస్ప్లే కలదు. ఇక మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యం తో కలదు.

NOKIA -G11 డ్యూయల్ కెమెరా సెటప్ కూడా కలదు. ముఖ్యంగా 50 మెగాపిక్సల్ కెమెరాతోపాటు సెల్ఫీ ప్రియుల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా కలదు. ఇక ఈ మొబైల్ ధర విషయానికి వస్తే రూ.12,499 రూపాయలకి కొనుగోలు చేసుకోవచ్చు అయితే కేవలం ఈ మొబైల్ బ్లూ గ్రే కలర్ లో మాత్రమే లభిస్తుంది. ఈ మొబైల్ త్వరలోనే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టోర్ల లో కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు నోకియా సంస్థ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: