సోషల్ మీడియా యాప్ లలో ఎక్కువ మంది వాడుతున్న  మెసెజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.త్వరలోనే మరో ఫీచర్ ను అందించనున్నట్లు తెలుస్తుంది.అందుకు సంబందించిన స్టేటస్ ను అప్డేట్ చేయనుంది.వీడియో కాల్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు పిక్చర్-ఇన్-పిక్చర్ మోడన్‌ను తీసుకురానుంది. కాగా,వినియోగదారుడు మరొక యాప్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ.. వీడియో కాల్‌లో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది.


అయితే, ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌లో విడుదల చేశారు. సెలెక్టెడ్ బీటా వినియోగదారులు ఈ న్యూ ఫీచర్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు.మరి కొద్ది రోజుల్లో ఈ ఫీచర్‌ను సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. అయితే, ఆండ్రాయిడ్ యూజర్లు ఎవరైనా వాట్సాప్ బీటా 22.24.0.79 అప్‌డేట్ చేసుకుంటారో వారి యాప్‌లో ఈ పిక్చర్-ఇన్-పిక్చర్ వస్తుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. iOS 16.1, ఆ పై వెర్షన్లలో ఈ ఫీచర్ పని చేస్తుంది..


వీడియో కాల్‌లో పిక్చర్-ఇన్-పిక్చర్ మోడన్‌ ద్వారా యూజర్లు పూర్తి భిన్నమైన అనుభూతిని పొందుతారాని కంపెనీ చెబుతోంది. వాట్సాప్ అకౌంట్‌లో ఈ ఫీచర్‌ను ఎనబుల్ చేస్తే.. వీడియో కాల్ సమయంలో మరొక యాప్‌ని సైతం యూజ్ చేయొచ్చు. ఇది పిక్చర్-ఇన్-పిక్చర్ వ్యూ లో కనిపిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి  రానున్నట్లు సదరు కంపెనీ ప్రకటించింది..


ఇదే కాదు..మరో సరికొత్త ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వాట్సప్. మెసేజ్‌ కనిపించకుండా చేసేందుకు షార్ట్‌ కట్ ఆప్షన్‌ను సిద్ధం చేస్తోంది. ఇది కూడా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులో ఉంది. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.22.24.9 అప్‌డేట్‌లో మెసేజ్ డిసప్పియర్ చేసే షార్ట్ కట్ ఫీచర్‌ను రీడిజైన్ చేస్తోంది. ఈ ఫీచర్‌తో కొత్త, పాత చాట్‌లను డిసప్పియర్ థ్రెడ్స్‌గా గుర్తించడం ఈజీ అవుతుంది..


డిసప్పియర్ మెసేజెస్ కోసం వాట్సాప్ బీటా 2.22.25.10 అప్‌డేట్ చేస్తున్నారు. ఇది మరింత మంది బీటా యూజర్లకు చేరువకానుంది. అలాగే కొత్త షార్ట్‌కట్ ఫీచర్‌ను మేనేజ్‌ స్టోరేజ్ విభాగం నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ విధంగా కొత్త ఫీచర్‌ మీ ఫోన్‌లో స్టోరేజీని సేవ్ చేయడంలో సహాయపడుతుంది..కాగా, పిక్చర్-ఇన్-పిక్చర్ షార్ట్ కట్ ఆప్షన్ ను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు..మరీ ఈ ఫీచర్ ఎలా వుంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: