
డైరెక్ట్ గా తయారు చేయకుండా ఒప్పో లేదా రియల్ మీ బ్రాండ్ తో కలిసి జతకట్టేందుకు చూస్తోందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. స్టన్నింగ్ లుక్కుతో ఉన్న ఫోన్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. Colaphoneglobal అనే ట్విట్టర్ ద్వారా కోలా ఫోన్ ఇప్పటిక సోషల్ మీడియాకు పరిచయమైంది. పీజీ డ్రింక్ మేకర్ ఐకానిక్ లోగో సిగ్నేచర్ రెడ్ కలర్ థీమ్‌తో ఈ మొబైల్ ఆకట్టుకునే విధంగా కనిపిస్తోందని మొబైల్ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు ఇది చూడడానికి రియల్ మీ 10 4g మొబైల్ లాగే కనిపిస్తోందని పూర్తిగా అర్థమవుతుంది.
కోకో కోలా బ్యాక్ గ్రౌండ్ ఉన్న టీజర్ ను రియల్ మీ ఇప్పటికి విడుదల చేయడం జరిగింది. స్మార్ట్ మొబైల్ తయారీ కంపెనీ వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదురుకొని స్పెషల్ ఎడిషన్లను మార్కెట్లోకి తీసుకురావడం కోసమే ఇలా కంపెనీలతో ఒప్పందం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మొబైల్ గురించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ రియల్ మీ 10 మోడల్ రీ బ్రాండెడ్ గానే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మొబైల్ 6.4 అంగుళాలతో 1080 పిక్చర్ క్వాలిటీతో అమౌంట్ డిస్ప్లే కలదు. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. బ్యాక్ కెమెరా 50 ఎంపీ.. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్..5000 mah బ్యాటరీ సామర్థ్యం తో సరికొత్త ఫీచర్స్ కలవు.