చాలామంది ప్రతిరోజూ మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు తమ చేతులు ఎలా ఉన్నాయో అనే విషయాన్ని గమనించరు ..ముఖ్యంగా తేమ చేతులు వర్షంలో తడిచిన మొబైల్ ఉన్నా సరే చార్జింగ్ పెట్టకండి అలా పెట్టేటప్పుడు ఖచ్చితంగా కరెంటు సరఫరా అవుతుందట దీంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి మొబైల్ వేరే అవకాశం తో పాటు పలు రకాల సమస్యలు కూడా ఎదురవుతాయట.
మొబైల్ ఛార్జింగ్ ని ఎల్లప్పుడు ఒరిజినల్ చార్జర్ తోనే పెట్టాలి తరచూ చాలా మంది మొబైల్ ఛార్జ్ చేయడానికి ఏదైనా చార్జర్ ని సైతం ఉపయోగిస్తూ ఉంటారు..ఇలా ఉపయోగించడం చాలా ప్రమాదమట. ఇలాంటి సందర్భాలలో కూడా చార్జర్ లో షార్ట్ సర్క్యూట్ కూడా అవుతుంది.
అంతేకాకుండా మొబైల్ వేడెక్కడం వేరే అవకాశం ఉంటుంది రాత్రిపూట మొబైల్ ఛార్జింగులు పెట్టకూడదు కొంతమంది నిద్రపోయే ముందు కచ్చితంగా చార్జింగ్ పెట్టి నిద్రపోతారు అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఛార్జింగ్ చేయడం మంచిది.
మొబైల్ ఛార్జింగ్ వైరులో ఎలాంటి పగులు లో ఉన్న ఆ చార్జర్ ని వాడకపోవడం మంచిది. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ చార్జర్ ను ఇతర మొబైల్ చార్జర్లకు ఉపయోగించడం వల్ల చాలా ప్రమాదము.
మొబైల్ వేడిగా ఉన్నప్పుడు చార్జింగ్ చేయకూడదు ఇలా చేస్తే పేలే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి