స్మార్ట్ మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.. ఎవరు ఉన్నా లేకపోయినా కచ్చితంగా మొబైల్ ఉంటే లోకాన్నే మరిచిపోతూ ఉంటారు.. అయితే చాలామంది యూజర్స్ సైతం తమ మొబైల్స్ కొన్ని కారణాల చేత నీళ్లలో పడిన సందర్భాలు ఉంటాయి.. లేదంటే వర్షంలో తడిచినప్పుడు కూడా మొబైల్ లోకి నీరు వెళ్లే అవకాశం ఉన్నది. ఇలాంటి క్రమంలోనే పలు రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు.అలా మొబైల్ లో పడిన నీటిని ఎలా బయటికి తీసివేయాలి అనే గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


మొబైల్ నీటిలో పడిన వెంటనే డివైస్ ని ఆపివేయాలి.. ఒకవేళ మొబైల్ అలాగే ఆన్ లో ఉంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.. ఆన్ లో ఉన్న మొబైల్ లోపల షార్ట్ సర్క్యూట్లు కూడా జరిగే ప్రమాదం ఉంటుంది.. నీటిలో పడిన వెంటనే మొబైల్ ని ఎక్కువగా షేర్ చేయకూడదు.. ఇలా చేయడం వల్ల నీరు లోపల అన్ని భాగాలలో చేరుతుంది. చాలామంది మొబైల్ లో నీరు బయటికి తీయడానికి హెయిర్ డ్రైయర్ను వంటివి ఉపయోగిస్తుంటారు ఇలాంటివి చేయడం చాలా ప్రమాదకరం.


నీటిలో పడిన వెంటనే మొబైల్ ని పొడి బట్టతో తుడిచి దాదాపుగా ఒక రోజంతా మొబైల్ ని ఉపయోగించకుండా బియ్యం డబ్బాలో ఉంచాలి దీని వల్ల మొబైల్ వేగంగా పొడిబారుతుంది.. అయితే బియ్యం లో పెట్టేటప్పుడు బియ్యపు గింజలు లోపలికి వెళ్లకుండా హెడ్ ఫోన్ జాక్ చార్జింగ్ పోర్టల్ వంటి వాటిలో జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే మొబైల్ లో ఉండే సిమ్ కార్డులను తీసివేయడం మంచిది. ఫోన్ పూర్తిగా ఆరిపోయిన తర్వాతే ఆన్ చేయాలి.. ఒకవేళ డిస్ప్లే మీద నీటి  తేమ కనిపిస్తూ ఉంటే రెండు నిమిషాల పాటు ఎండలో ఉంచడం మంచిది. అయినా ఆవిరి కాకుంటే సర్వీసెస్ సెంటర్ కి వెళ్లాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: