ఇక ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం బాగా పెరిగింది.ఈ పెరిగిన వినియోగానికి అనుగుణంగా కొన్ని రకాల యాప్స్‌ యువతను ఇంకా బాగా ఆకట్టుకుంటున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు ఇండియాలో షార్ట్-వీడియో-మేకింగ్ ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్ ఎంత ఎక్కువ ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ టిక్ టాక్ చాలా మందిని వైరల్ చేసింది.అయితే ఇండియా -చైనా మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే ఇతర దేశాల్లో టిక్‌టాక్‌ అనేది అందుబాటులో ఉంది. అయితే కేవలం షార్ట్‌ వీడియోలకు మాత్రమే పరిమితమైన టిక్‌టాక్‌ తాజాగా వినియోగదారులకు ఏకంగా 30 నిమిషాల వీడియోలను అప్‌లోడ్ చేయడంలో సహాయపడే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ తాజా అప్‌డేట్‌ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.గూగుల్ యాజమాన్యంలోని వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన యూట్యూబ్‌కు పోటీగా ఈ వ్యూహాత్మకంగా టిక్‌టాక్‌ ఈ అప్‌డేట్‌ తీసుకొస్తుందని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు. టిక్‌టాక్‌ యాప్‌నుకు సంబంధించిన ఐఓఎస్‌ బీటా వెర్షన్‌లో మొదటిసారి ఈ కొత్త అప్‌డేట్‌ను టెక్‌ నిపుణులు గుర్తించడం జరిగింది.


టిక్‌టాక్‌ మొదట్లో అసలు వీడియో సమయ పరిమితి మొత్తం 15 సెకన్లతో ప్రారంభించబడింది, ఆపై దానిని ఒక నిమిషం దాకా అప్‌గ్రేడ్ చేసింది. ఆపై దానిని మొత్తం మూడు నిమిషాలకు విస్తరించింది. తరువాత దానిని ఇప్పుడు ఏకంగా 10 నిమిషాలకు పొడిగించింది.టిక్‌టాక్‌ కొన్ని నెలల ముందు 15 నిమిషాల వీడియో అప్‌లోడ్ పరిమితిని పరీక్షించడం ప్రారంభించింది. కొత్త 30 నిమిషాల వీడియో పరిమితి చైనీస్ యాప్‌కి కొత్త అవకాశాలను తెరిచే ఛాన్స్ ఉంది. బైట్‌డాన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్‌ సంచిత వినియోగదారుల వ్యయంలో యూఎస్‌డీ 10 బిలియన్లను అధిగమించిన మొదటి యాప్‌లో ఒకటిగా ఇది నిలిచింది. కేవలం మూడు సంవత్సరాల్లో చైనీస్ షార్ట్-ఫారమ్ వీడియో ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్ యూఎస్‌ యూజర్ల నుంచి వాటా ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది. 2020లో 3 శాతం నుంచి 2023లో 14 శాతానికి ఇది పెరిగింది. టిక్‌టాక్‌ ఎన్నో ఇతర సోషల్ మీడియా సైట్‌లకు భిన్నంగా ఉండడంతో యువత ఎక్కువగా వాడుతన్నారని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా యూఎస్‌లోని 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు కలిగిన వారు టిక్‌టాక్‌ను చాలా ఎక్కువగా వాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: