స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి కొన్ని సందర్భాలలో చికాకు తెర్పిస్తూ ఉంటుంది.ముఖ్యంగా మొబైల్ స్లో అవ్వడం హ్యాంగ్ అవడం వంటివి జరుగుతూ ఉన్నప్పుడు చాలా చికాకుగా ఉంటుంది. ముఖ్యంగా మొబైల్లో ఉండే స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు మరింత ఈ సమస్య ఎక్కువగా ఉంటుందట.  మొబైల్ ని ఎక్కువగా మనం ఉపయోగించలేము.. అయితే మీ మొబైల్ లో ఉండే స్టోరేజ్ని తొలగించడమే ఇందుకు  మార్గం అని కూడా చెప్పవచ్చు.మరి కొంతమంది ఎక్కువగా ఉపయోగపడని యాప్స్ కూడా కొన్ని సందర్భాలలో ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఓటీటీ యాప్స్ తో పాటు సోషల్ మీడియా యాప్స్ ఎక్కువగా వినియోగించనీ లేదా గేమింగ్ యాప్స్ స్టోరేజ్ ని ఎక్కువగా వినియోగిస్తాయి.. వీటిని అన్ఇన్స్టాల్ చేయడం వల్ల కూడా స్టోరేజ్ ని ఆదా చేసుకోవచ్చు.. ఆండ్రాయిడ్, ఐఫోన్ యాప్స్ ఎక్కువగా స్టోరేజ్ తీసుకుంటూ ఉంటాయి. వాటిని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


ముఖ్యంగా ఐఫోన్ వినియోగదారులు మొబైల్ సెట్టింగ్ ని ఓపెన్ చేయాలి.

సెట్టింగ్ లో జనరల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి..

ఐఫోన్ స్టోరేజ్ ని ఎంచుకున్నప్పుడు యాప్స్ జాబితా పూర్తిగా చూపిస్తుంది.

ఏ యాప్ లో ఎక్కువ స్టోరేజ్ ఉంది అక్కడ ఆ యాప్ మీద క్లిక్ చేసి మనం యాప్ ని రీస్టోర్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ మొబైల్స్:
స్మార్ట్ మొబైల్స్ లో google play store లో యాప్స్ ని ఓపెన్ చేయాలి.


ఏ యాప్ లో ఎక్కువ స్టోరేజ్ ఉందో అక్కడ మనం చూసుకోవాలి. అక్కడ ఉపయోగపడని యాప్స్ ఉన్న ఫైల్స్ ఉన్న వెంటనే డిలీట్ చేయడం మంచిది.స్మార్ట్ మొబైల్ ముందుగా అప్డేట్ చేయడం వల్ల వేగాన్ని మరింత పుంజుకుంటుంది. ఎప్పటికప్పుడు యాప్స్ ని అప్డేట్ చేస్తూ ఉండాలి. స్మార్ట్ మొబైల్ లో ముఖ్యంగా జంక్ ఫైల్స్ ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయడం మంచిది. అలాగే మొబైల్ లో యాంటీవైరస్ యాప్స్ ఉన్న మొబైల్ స్లో అవుతుంది. మొబైల్ కొనేటప్పుడు ఎక్కువ స్టోరేజ్ కలిగి ఉన్న మొబైల్ ని కొనడం మంచిది.


కచ్చితంగా వారంలో ఒకసారైనా మొబైల్ లోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి క్యాచ్ ని క్లియర్ చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: